ఏపీలో రాబోయే 2024 ఎన్నికల దృష్య్టా ఇప్పటి నుంచే రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈనేపథ్యంలోనే టీడీపీలో భిన్పమైన వాదనలు తెలుగు తమ్ముళ్లు వినిపిస్తున్నారు.ఎలా ముందుకు సాగాలి ? ఎలా గెలవాలి ? అసలు వ్యూహాలు ఏంటీ ? అనే వాటిపైనే టీడీపీ నేతలు పూర్తి ఫోకస్ పెట్టారు.2019 ఎన్నికల ప్రభావం టీడీపీపై తీవ్రంగా పడింది.ఇప్పుడు సరైన వ్యూహంతో ముందుకు వెళ్లకుంటే తమకు తిప్పలు తప్పవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట.ఈ క్రమంలో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుని 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని యోచిస్తున్నారట.కానీ, టీడీపీ నేతలు దానిని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.పొత్తుల జోలికి వెళ్లవద్దని, పార్టీని తామే ముందుండి నడిపిస్తామని.
అధికారం లోకి తీసుకొస్తామని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారట.ఇందుకు టీడీపీ నేతలు సైతం మద్దతు తెలుపుతుండడం గమనార్హం.
ప్రస్తుతం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తమ పరిస్థితేంటీ ? రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది ? మూడేండ్లుగా నియోజకవర్గంలో ఉంటున్నామని ? తమ స్థానాల్లో వేరే వారికి అవకాశం ఇస్తే… మేము ఏమి చేయాలని ? టీడీపీ ముఖ్య నేతలు తమ స్వరం వినిపిస్తున్నారట.అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం పనిచేశారు.
ఒకానొక దశలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా… పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా వెనకడుగేయకుండా ముందుకు సాగారు.అందువల్లే టీడీపీ నేటికీ క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉంది.ఇటీవల టీడీపీ కీలక నేత మాట్లాడిన మాటలు చర్చకు దారితీస్తోంది.

టీడీపీ అధికారం కోల్పోతే పార్టీని మళ్లీ అధికారంలోకి ఎలా తీసుకురావాలి ? అనేది కార్యకర్తలకు తెలుసని, అధికారంలోకి వస్తే వచ్చే పదేండ్లు గానీ, ఇరవై ఏండ్లు గానీ ఎలా నిలబెట్టుకోవాలో అనే ఆలోచన చేయాలని అని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.ఇదే క్రమంలో కార్యకర్తలు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై కసి తీర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారట.
అందుకనే పొత్తులు అవసరం లేదనే సంకేతాలు ఇస్తున్నారట.
కాగా గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ కేడర్‌ను గాలికొదిలేసిన విషయం విధితమే.
దీంతో ఎన్నికలప్పుడు పార్టీకి వారంతా దూరంగా ఉన్నారు.ప్రస్తుతం వైసీపీ మితిమీరిన ఆగడాలు చూసి ఎలాగైనా టీడీపీని గెలపించుకోవాలనే కసితో పని చేస్తున్నారు.
అందకనే పొత్తుల జోలికి పోకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట.మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? ఇప్పటి వరకు వన్‌సైడ్ లవ్ ట్రాక్‌ను టూ సైడ్ లవ్ ట్రాక్ దాకా తీసుకొచ్చిన ఆయన ఒంటరిగా బరిలో దిగుతారా ? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే.
.