జగ్గారెడ్డిపై చర్యలతో తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడుతుందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.కాని కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చేసిన పరిస్థితి ఉంది.

 Will The Congress In Telangana Be Weakened By The Actions Against Jaggareddy Ml-TeluguStop.com

అయితే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్, మహేష్ గౌడ్ లపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ సహా మిగతా పదవుల నుండి తొలగించిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత జగ్గారెడ్డి కూడా నా తడాఖా ఎంతో రేవంత్ కు తెలియదని త్వరలోనే చూపిస్తానని ఎలానో ఇప్పుడు చెప్పనని సమయం వచ్చినప్పుడు తెలుస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు జగ్గారెడ్డిపై చర్యలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ.

అయితే కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేకున్నా మరల సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా మారితే అప్పుడు కొంత అవగాహన  వచ్చే  అవకాశం ఉంది.

Telugu Jagga, Mahesh Gowd, Manikyam Tagore, Revanth Reddy, Telangana, Ts Poltics

అయితే జగ్గారెడ్డి మాత్రం తగ్గేదేలే అన్న చందంగా రేవంత్ రెడ్డి నన్ను ఏమీ చేయలేరని సంగారెడ్డిలో నా కన్నా ధీటైన అభ్యర్థిని నిలబెట్టి చూపించాలని రేవంత్ కు సవాల్ విసిరారు.అయితే రేవంత్ వర్గం మాత్రం జగ్గారెడ్డిపై చర్యలతో కాంగ్రెస్ బలహీన పడే ప్రసక్తి లేదని కాంగ్రెస్ వ్యతిరేక చర్యలకు పాల్పడటం వల్లనే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుందని రేవంత్ వర్గం అభిప్రాయ పడుతున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎలా పావులు కదుపుతాడనే విషయం ఇప్పుడు ఎవరి నచ్చినట్టు వారు విశ్లేషించుకుంటున్న పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube