వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన భారతీయులు అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఏకంగా దేశ ఉపాధ్యక్ష పదవిలో భారత మూలాలున్న వ్యక్తి వుండటం మనందరికీ గర్వకారణం.
ఇన్ని విజయాలు సాధిస్తున్నప్పటికీ.ఇండో అమెరికన్లపై మతపరమైన వివక్ష కొనసాగుతూనే వుంది.
అమెరికాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సిక్కులు, హిందువులు వివక్షను ఎదుర్కొంటున్నారు.అయితే కొందరి కృషి మూలంగా ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది.
ఈ క్రమంలో వ్యోమింగ్‌లోని ఎఫ్ఈ వారెన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన దర్శన్ షాకు.యూనిఫాంలో వుండగా తిలక ధారణ చేసేందుకు మతపరమైన మినహాయింపు లభించింది.90వ ఆపరేషనల్ మెడికల్ రెడీనెస్ స్క్వాడ్రన్‌కు కేటాయించబడిన ఏరోస్పేస్ మెడికల్ టెక్నీషియన్ అయిన దర్శన్ రెండేళ్ల క్రితం మిలటరీలో చేరారు.నాటి నుంచి ఆయన తిలక ధారణ చేసేందుకు మినహాయింపు కోరుతున్నారు.
ఈ క్రమంలో ఆయనకు గత నెలలో అనుమతి లభించింది.
మిన్నెసోటాలోని ఈడెన్ ప్రైరీలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తన్ స్వామి నారాయణ్ (బీఏపీఎస్) భక్తులైన గుజరాతీ కుటుంబంలో షా పుట్టి, పెరిగారు.
ఈ శాఖ మతపరమైన చిహ్నం నారింజ రంగు ‘‘U’’ అనే అక్షరం.దర్శన్ షా.జూన్ 2020లో ప్రాథమిక సైనిక శిక్షణకు హాజరైన నాటి నుంచి యూనిఫాంలో తిలక్ ధరించడానికి అనుమతి కోరడం ప్రారంభించాడు.ఈ మేరకు ఎప్పటికప్పడు ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్‌లోని వ్యక్తిగత ప్రోగ్రామ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లేవాడు.
కనీసం 20 ఏళ్ల పాటు యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించాలని షా యోచిస్తున్నారు.డిగ్రీ చదివిన తర్వాత కమీషన్డ్ ఆఫీసరై, డాక్టర్‌గా సేవలందించాలని దర్శన్ భావించారు.ఫ్రాన్సిస్ ఈ వారెన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ అనేది వ్యోమింగ్‌లోని సెయెన్‌కు పశ్చిమాన వున్న యూఎస్ వైమానిక దళ స్థావరం.అమెరికాలోని మూడు వ్యూహాత్మక క్షిపణి స్థావరాలలో ఇది కూడా ఒకటి.







