వయసు పైబడే కొద్ది జుట్టుతో పాటు గడ్డం కూడా తెల్లబడటం సర్వ సాధారణం.కానీ, ఇటీవల రోజుల్లో చాలా మంది ఈ సమస్యలను యంగ్ ఏజ్‌లో ఎదుర్కొంటున్నారు.
అందులోనూ పురుషుల్లో కొందరికి జుట్టు నల్లగానే ఉన్నా గడ్డం మాత్రం తెల్లగా మారుతుంటుంది.హెయిర్ ఫాలిసెల్స్ లో మెలనిన్ తగ్గడం వల్ల ఇలా జరుగుతుంటుంది.
ఏదేమైనా గడ్డంలో వచ్చిన తెల్ల వెంట్రుకలను కవర్ చేసుకునేందుకు కలర్స్‌పై ఆధారపడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీస్ ట్రై చేస్తే సహజంగానే తెల్లబడ్డ గడ్డం నల్లగా మారుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీస్ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, రెండు టేబుల్ స్పూన్ల కొకొనట్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ వేసి మళ్లీ కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని గడ్డానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఒక గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్‌గా ఇలా చేస్తే గనుక తెల్లబడిన గడ్డం మళ్లీ నల్లగా మారుతుంది.

అలాగే మరో విధంగా కూడా తెల్ల గడ్డాన్ని నివారించుకోవచ్చు.అందు కోసం రెండు బంగాళదుంపులకు ఉన్న తొక్కలను మాత్రం తీసుకుని నీటితో ఒకసారి కడగాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో బంగాళదుంప తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్‌ను మాత్రం ఫిల్టర్ చేసుకుని అందులో ఒక ఎగ్ ఎల్లోను వేసి మిక్స్ చేసుకుని గడ్డానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.