సమ్మర్ సీజన్‌లో ప్రధానంగా వేధించే చర్మ సమస్య సన్ ట్యాన్.అలా ఓ పావు గంట ఎండల్లో ఉన్నామంటే చాలు చర్మం ట్యాన్ అయిపోతుంటుంది.
ఇక ఆ తర్వాత చర్మాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.రకరకాల స్క్రబ్బింగ్ ప్యాకులు యూజ్ చేస్తుంటారు.
మరెన్నో మాస్కులు వేసుకుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుండా ఏం చేయాలో తెలీక తెగ సతమతం అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గనుక సన్ ట్యాన్ సమస్య పరార్ అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటీ.? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మ్యాగీ నూడిల్స్ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూడిల్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి కలుపుకోవాలి.చివరగా పచ్చి పాలను కూడా వేసి అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ట్యాన్ అయిన చోట అప్లై చేసి పది నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే సన్ ట్యాన్ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.అంతే కాదు, పైన చెప్పిన రెమెడీని తరచూ ట్రై చేస్తే చర్మం కాంతి వంతంగా, మృదువుగా మారుతుంది.
డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి.మరియు స్కిన్ టోన్ సైతం పెరుగుతుంది.
కాబట్టి, తప్పకుండా ఆ రెమెడీని ప్రయత్నించండి.