స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ వారం విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇందులో స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా నటించారు.
ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినీ బృందం ప్రమోషన్స్ భాగంగా పలు ఇంటర్వ్యూలలో బాగా బిజీగా ఉన్నారు.మరోవైపు స్టార్ హీరోల అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఇక ఇప్పటి నుండే థియేటర్లలో పోస్టర్లతో సందడి చేస్తున్నారు అభిమానులు.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యా యత్నం చేయగా ప్రస్తుతం ఈ విషయం గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా కోదాడలోని ఓ ప్రముఖ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో రామ్ చరణ్ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య పరస్పరం ఘర్షణ ఏర్పడింది.
ఎన్టీఆర్ అభిమానులలో ఓ అభిమాని పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
దీంతో అక్కడున్నవారంతా అతడిని అడ్డగించి ప్రాణాలు కాపాడినట్లు తెలిసింది.దీంతో ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఇక ఈ సినిమా విడుదల తర్వాత తమ అభిమాన హీరోల పాత్రలలో తేడా ఉంటే అభిమానులు ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.
నిజానికి గతంలో రాజమౌళి ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా చూసే విధంగా పాత్రలను సమానంగా రూపొందించానని తెలిపాడు.అంతే కాకుండా థియేటర్ల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా చూస్తామని గతంలో తెలిపాడు.ఇక ఈ గొడవ గురించి ఎన్టీఆర్ ఏమని స్పందిస్తాడో చూడాలి.







