కేసీఆర్ మంత్ర‌వర్గంలో 420లుఉన్నారంటున్న తరుణ్ చుగ్ కామెంట్స్..

వికారాబాద్ జిల్లా  అనంతగిరిలో బీజేపీ జిల్లా కార్య‌వ‌ర్గ స‌మావేశం ముఖ్య అతిదిగా హాజరైన రాష్ట్ర వ్యహారాల ఇన్ఛార్ తరుణ్ చుగ్.కేసీఆర్ మంత్ర‌వర్గంలో 420లుఉన్నారంటున్న తరుణ్ చుగ్ కామెంట్స్.

 Tarun Chugh Comments That There Are 420s In The Kcr Ministry , Kcr, Tarun Chugh-TeluguStop.com

తెలంగాణ‌లో బీజేపీ సునామీ రావ‌డం ఖాయం… ఆపే వాళ్లు ఎవ‌రూ లేరు కేసీఆర్ ఆశ‌లు గాలిలో మేడ‌ల్ల కూలిపోవ‌డం ఖాయం బీజేపీ కార్య‌క‌ర్త‌లు స‌మిష్టిగా పోరాడాలి.కేసీఆర్‌ను గ‌ద్దె దించాలి అవినీతి కుటుంబ పాల‌నను ఓడించి అంతా క‌లిసి ప్ర‌జల‌కు న్యాయం జ‌రిగేలా పోరాడాలి కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేసిన విశ్వాస ఘాతుకం నుండి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ర‌క్షించాలి.

ప్ర‌జాస్వామ్య యుతంగా కుటుంబ అవినీతి పాల‌న‌ను అంతమొందించేందుకు కార్య‌క‌ర్త‌లు కృషిచేయాలి .ప్ర‌తి ఒక్క‌రు గ‌ల్లి గ‌ల్లి, వార్డ్ వ‌ర‌కు , శ‌క్తి కేంద్రం వ‌ర‌కు వెళ్లి అంద‌రినీ సంఘ‌టితం చేయాలి.

బీజేపీ ఎలా తెలంగాణ ప్రజ‌ల‌కు న్యాయం చేస్తుందో చెప్పాలి.ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు బీజేపీ అతి పెద్ద ఆందోళ‌న చేప‌ట్ట‌బోతోంది.అంద‌రికీ న్యాయం జ‌రిగేలా చేస్తాం.తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ స‌ర్కార్ మోసం చేసింది తెలంగాణ వ‌స్తే బ్రతుకులు బాగుప‌డ‌తాయ‌ని కేసీఆర్ చెప్పాడు ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమ‌లు చేయ‌లేదు… కేసీఆర్ కుటుంబానికి మాత్రం అన్ని ద‌క్కాయి.

తెలంగాణ కోసం అనేక మంది యువ‌కులు భ‌లిధానం చేసుకున్నారు .కాని ల‌బ్దిమాత్రం కల్వ‌కుంట్ల కుటుంబానికి ద‌క్కింది.లాఠీ దెబ్బ‌లు యువ‌కులు తింటే .ల‌బ్దిమాత్రం అమ‌రికా నుండి వ‌చ్చిన కేటీఆర్ కు ద‌క్కింది తెలంగాణ ఉధ్య‌మంతో క‌నీసం సంభందం లేని ప‌దిమంది తెలంగాణ‌లో అధికారం చ‌లాయిస్తున్నారు.కేసీఆర్ టీఆర్ఎస్ లో ప్ర‌జాస్వామ్యం లేకుండా చేసాడు.స‌ర్కార్ లో ఉన్నాం కాబ‌ట్టి టీఆర్ఎస్ లో ఉన్నాం అంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు. పార్టీలో క‌నీసం స్వేచ్చ‌గా గాలి పీల్చే ప‌రిస్థితి లేదంటున్నారు .

తెలంగాణ అభివృద్ది కోసం కాదు.రాష్ట్రంను దోచుకునేందుకు రోజుకో కొత్త ఎత్తుగ‌డ వేస్తున్నారు.టీఆర్ఎస్ నేత‌లు పార్టీని విడిపెట్టాల‌ని చూస్తున్నారు… ఏ గ్రామంలో సామాన్యూడిని అడిగినా ఇది దొంగ ప్ర‌భుత్వం .ప్ర‌జ‌ల క‌ల‌ల‌పట్ల విశ్వాస ఘాతుకం చేసాడు అని చెబుతారు.తెలంగాణ‌లో రైతులు, యువ‌కులు, మ‌హిళ‌లు, ద‌ళితులు నారాజ్ లో ఉన్నారు.

ఏ ఒక్క‌రు సంతోషంగా లేదు మంత్రులపై ముఖ్య‌మంత్రి కిచెన్ క్యాబినేట్ పెత్త‌నం చెయాలిస్తుంది.ముఖ్య‌మంత్రి కాకుండా మ‌రింత మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు.

కుటుంబంలో ఒక్కో విభాగానికి ఒక్కో ముఖ్య‌మంత్రి ఉన్నారు.వారంతా దోచుకునేందుకు ఆలోచ‌న‌లు చేస్తుంటారు,సంభ‌య్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేస్తే ఆయ‌నపై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

ప్ర‌జ‌లు బండి సంజ‌య్ వెంట ఉన్నార‌న్న ఉద్దేశ్యంలో సంజ‌య్ ని ఇబ్బందులు పెట్టేందుకు కేసీఆర్ చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube