వైసీపీ టార్గెట్ 50 సీట్లు ! అంటే 150 సీట్ల ప‌ర్ఫామెన్స్ కూడా అంతేగా !

ఏపీ మంగ‌ళ‌ గిరిలో ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పార్టీ 9వ ఆవిర్భావ స‌మావేశం నిర్వ‌హించారు.వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని, వైసీపీ కొమ్ములు విరిచేస్తాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తాం.

 Ycp Target 50 Seats! That Means A 150-seat Performance, Too! , Ycp Politics, Ap-TeluguStop.com

అంటూ సీఎం జ‌గ‌న్ పై విరుచుకు ప‌డిన విష‌యం విధిత‌మే.దీంతో వైసీపీ నేత‌లు అయోమయంలో ప‌డ్డార‌ని స‌మాచారం.

ఇందుకు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ హుటాహుటిన వైసీపీ స‌భా స‌మావేశం నిర్వ‌హించ‌డం అద్దం ప‌డుతోంది.ఇలాంటి స‌మావేశం నిర్వ‌హించి చాలా రోజుల‌వుతోంది.

కానీ, ఉన్న‌ట్టుండి శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డం, చ‌ర్చ‌కు దారితీస్తోంది.

అయితే ఈ స‌మావేశంలో జ‌గ‌న్ స‌ర్వే చేయించిన విష‌యం ఎమ్మెల్యేల‌కు చెప్పార‌ట‌.

ఇది వారికి ఒక ఉప‌దేశమేన‌ని చెప్పొచ్చు.కాగా జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌పై చేయించిన స‌ర్వేలో 50మంది ఎమ్మెల్యే ప‌నితీరు స‌రిగ్గా  లేద‌ని తేలింద‌ని కుండ‌ బ‌ద్ద‌లు కొట్టార‌ట‌.

స‌ద‌రు ఎమ్మెల్యేలు ప్ర‌జాక్షేత్రంలో ఉండ‌ కుండా, నియోజ‌క‌వ‌ర్గాలకు దూరంగా పొరుగు రాష్ట్రాల‌పై క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు, తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉంటున్నార‌ట‌.అక్క‌డి నుంచే వారి వ్యాపారాలు, వ్య‌వహారాలు చూసుకుంటున్నార‌ని స‌ర్వేలో తేలింద‌ట‌.

అయితే జ‌గ‌న్ చెప్పిన‌ట్టు 50మంది ప‌ర్ఫామెన్స్ స‌రిగ్గా  లేకుంటే … 150మంది కూడా ఎలా ప‌ని చేస్తున్నార‌నే సందేహం రాక మాన‌దు.ఎందుకంటే పార్టీలోని ఎమ్మెల్యేలంద‌రికి ఒకే రూల్ ఉంటుంది.

ఈ లెక్క‌న చూస్తే అంద‌రి ప‌రిస్థితేంటీ ? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డ చూసినా అభివృద్ధి కాన‌రాని ప‌రిస్థితి.

ఇక పార్టీ నాయ‌కుల‌కు ఎలాంటి భ‌రోసా లేదు.ఎన్నిక‌ల స‌మ‌యంలో చెమ‌టోడ్చి ప‌నిచేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు.

ప్ర‌స్తుతం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.ఒక్క సంక్షేమ కార్య‌క్ర‌మాల ఊసు త‌ప్ప మ‌రేదీ క‌న్పించ‌డం లేదు.

అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ప్ర‌జ‌ల్లోనూ విశ్వ‌స‌త కోల్పోతుందా ? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.ఇక అభివృద్ధి గురించి ఏంట‌నేది ? ప్ర‌శ్నగానే మిగులుతోంది.ఎమ్మెల్యేలంద‌రికి ఒకే రూల్ ఉన్న‌ప్పుడు ఆ 50మంది మాత్ర‌మే ఎందుకు వెన‌క‌ బ‌డ్డారనేది చ‌ర్చ‌కు దారి తీస్తోంది.ఈ 50 మందినే సీఎం జ‌గ‌న్ టార్గెట్ చేస్తున్నాడా ? అలా అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి కూడా అంతేగా అని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube