యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR ఈ సినిమా ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఇకపోతే తాజాగా వీరిద్దరు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణితో కలసి ముచ్చటించారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి ఎన్టీఆర్ ను పలు ప్రశ్నలు వేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కీరవాణి కంపోజ్ చేసిన పాటలు భీమవరం బుల్లోడ పాలు కావాలా అనే పాట తనకు ఏమాత్రం నచ్చదని ఎన్టీఆర్ వెల్లడించారు.
ఇకపోతే సింగర్ గీతా మాధురి మోహన భోగరాజు పాటలు అంటే తనకు ఇష్టమని తెలియజేశారు.ఇక ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి ఎన్టీఆర్ ని మరొక ప్రశ్న వేశారు.
ఒకవేళ మీ సినిమాలలో యాంకర్ సుమ కనుక నటిస్తే ఆమెకు ఎలాంటి పాత్ర ఇస్తారని ప్రశ్నించగా ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన సినిమాలలో కనక సుమకి ఏదైనా పాత్ర ఇవ్వాల్సి వస్తే ఆమెకు నానమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలోళ్ళ పాత్ర ఇవ్వాలని, సుమకు చాదస్తం చాలా ఎక్కువ, ఎప్పుడు నోరేసుకుని పడిపోతుంది తనని చూడగానే గయ్యాళి అత్త పాత్ర గుర్తిస్తుందని ఎన్టీఆర్ సుమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం సుమ గురించి ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈ వ్యాఖ్యల పై సుమ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఇకపోతే వ్యక్తిగతంగా సుమ భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.







