దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు నిన్న ఘనంగా జరిగాయి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలారు.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి హోలీ పండగను సింపుల్‌గా కానిచ్చేసిన ప్రజలు.ఈ ఏడాది మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా హోలీ ఆడిన తర్వాత మన చర్మం మరియు జుట్టుపై పడ్డ రంగులను వదిలించడమే కష్టంగా మారు తుంటుంది.అందులోనూ సింథటిక్ కలర్స్‌ను వాడితే.
ఇక వారి బాధ వర్ణణాతీతం.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే గనుక హోలీ రంగులను సులభంగా పోగొట్టు కోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముఖంపై, ఒంటిపై పడిన రంగులను పోగొట్టు కునేందుకు.
మొదట కొబ్బరి నూనెను తీసుకుని చర్మం మొత్తానికి అప్లై చేయాలి.ఆ తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం మరియు టమాటో జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి కాస్త ఆరిన తర్వాత మెల్ల మెల్లగా రబ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.ఇలా చేస్తే చర్మానికి పట్టి ఉన్న రంగు పోతుంది.
అలాగే జుట్టు నుండి కలర్‌ను ఎలా తొలగించాలంటే.రెండు ఎగ్ వైట్లను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి.నలబై నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత మైల్డ్ షాంపూను యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.హోలీ ఆడిన తర్వాత ఇలా చేస్తే హెయిర్ నుండి ఈజీగా కలర్‌ను వదిలించు కోవచ్చు.