దట్టమైన అటవీప్రాంతంలో పాఖాలసరస్సుకు కూతవేటు దూరంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండలం సమీపంలో శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది.గిరిజనుల సంప్రదాయాల డప్పు చప్పుళ్ళు డోలు వాయిద్యాల నడుమ గిరిజన సాంప్రదాయం ప్రకారం గురువారం అమ్మవారిని గుట్టనుండి గుడికి తీసుకువచ్చి గద్దె మీద నిలిపి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతిరెండు సంవత్సరాలకు జరిగే ఈజాతరకు స్థానిక గిరిజనులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.తమ పిల్లాపాపలు పాడి పంటలు చల్లగఉండాలని తమమనుసులోని కోరికలు తీర్చాలని అమ్మవారికి మొక్కులు చేల్లించుకున్నారు.
మండు వేసవిలో కూడపారే సెలయారుతో పాటు కొరినకోరికలు తీర్చే అమ్మవారు ఎంతో ప్రత్యేకం.అందువల్లనే స్థానిక ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచికూడా అనేక మందిప్రజలువచి నిత్యం దర్శించుకుంటారు.
మూడురోజుల పాటు జరిగే ఈ జాతరకు ములుగునియోజకవర్గా శాసనసభ సభ్యురాలు mla సీతక్క వచ్చి దర్శించుకున్నారు.అనంతరం ఇక్కడ జరిగిన జాతర సంబరాలలో పాల్గొని స్థానిప్రజలతో మమేకమై వారితో కలిసి నృత్యాలు చేశారు.
కాగా శుక్రవారం మొక్కుల చేల్లిపుల అనంతరం శ్రీముసలమ్మ తల్లి వనప్రవేశం చేయనున్నారు.







