ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రోజు రోజుకీ ఈ సినిమాపై ఆత్రుత అంతకంతకు పెరిగిపోతోంది.
ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలోనే అభిమానుల అంచనాలు మరింత పెంచే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా సీక్రెట్ ని రివీల్ చేశారు రాజమౌళి.
తాజాగా ఆర్ఆర్ఆర్ విట్టల్ హ్యాండిల్ నుంచి సమ్థింగ్ డిఫరెంట్ థాట్ తో ఒక వీడియో విడుదల అయ్యింది.ఆ వీడియోలో చెర్రీ, తారక్, జక్కన్న ముగ్గురు కలిసి ఆనందంగా నవ్వుతూ మాట్లాడుకోవడం ముచ్చటగా అనిపించింది.
ఎన్టీఆర్ అలసిపోయాను అని అనడంతో చరణ్ నీకోసం నేను కాఫీ కలుపుతాను అనడం, అప్పుడు ఎన్టీఆర్ నీ చేతితో విషం ఇచ్చిన తాగిస్తా అని అన్నారు.అలా వారిద్దరి మాటలతో వారి మధ్య స్నేహబంధం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిపోయింది.
అదేవిధంగా ప్రమోషనల్ ఈవెంట్ కోసం పలు ప్రాంతాల పర్యటన లపై చర్చించుకోవడం, అలాగే రాజమౌళి రాజేసిన టాపిక్ తో చెర్రీ,తారక్ లు నాదంటే నాది అంటూ అల్లరి చేయడం ఇవన్నీ కూడా సరదాగా అనిపించాయి.ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళిని చెర్రీ తారక్ లు ఎంత ఇబ్బంది పెట్టారో తెలిపారు రాజమౌళి.
రాజమౌళి కీరవాణి వాళ్ల దృష్టిలో సినిమాను జీడిపప్పు ఉప్మా ఇలా కంప్లీట్ చేసుకుంటూ, అందులో కథ ఉప్మా అయితే, హీరోయిన్ ఎంట్రీ,ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ట్విస్ట్ టర్నులు ఇవన్నీ కూడా జీడిపప్పు లట.

సినిమా రికార్డింగ్ సమయంలో పెద్దన్న జీడిపప్పులు సరిపోతాయా అని అడగగా అప్పుడు కీరవాణీ పర్ఫెక్ట్ గా కుదిరాయి ఒక్క ఎపిసోడ్ గురించి అడిగినప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడకు ఆ ఎపిసోడ్ జీడిపప్పు కాదు ఆటంబాంబ్ అని అన్నారట.అదే విషయాన్ని తాను కూడా నమ్ముతున్నాను అంటూ ఆర్ఆర్ఆర్ సినిమా సెకండాఫ్ లో బ్లాస్ట్ అయ్యే ఒక బాంబింగ్ ఎపిసోడ్ గురించి హింట్ ఇచ్చాడు రాజమౌళి.రాజమౌళి మాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఒకవైపు హీరోలిద్దరూ పావుగంట ఎక్స్ట్రీమ్ లెవెల్ లో, ఎక్స్ట్రార్డినరీగా జరిగే ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి చెబుతూ హైప్ ఎక్కించారు రాజమౌళి.సెకండాఫ్ లో ఉంటుంది అసలైన ఆటంబాంబు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు నెలకొనడమే కాకుండా సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







