ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు ఆ పని చేయలేదట.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలైంది.20 ఏళ్ల సినీ కెరీర్ లో తారక్ ఇప్పటివరకు 29 సినిమాలలో నటించారు.హిట్ ఫ్లాపులకు అతీతంగా తారక్ సినీ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.అయితే ఇన్నేళ్ల సినీ కెరీర్ లో తాను ఒక్క పనిని మాత్రం చేయలేదని తారక్ చెప్పుకొచ్చారు.

 Interesting Facts About Young Tiger Junior Ntr Details, Junior Ntr, Ntr, Ram Cha-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు పెయిడ్ ప్రివ్యూలు ఉంటాయో లేదో క్లారిటీ లేదు.

పెయిడ్ ప్రివ్యూలు ఉంటే ఈ నెల 24వ తేదీన లేకపోతే 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.అయితే సినిమాను ఎక్కడ చూడాలని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి మాట్లాడుకోగా తాను ప్రేక్షకులతో కలిసి చిరుత సినిమాను చూశానని చరణ్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత తాను ప్రేక్షకులతో కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా చూడలేదని చరణ్ కామెంట్లు చేశారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఇప్పటివరకు ఆడియన్స్ మధ్య కూర్చుని ఒక్క సినిమా కూడా చూడలేదంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Telugu Career, Audience, Chirutha, Rajamouli, Ntr, Pan India, Ram Charan, Rrr, T

ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం ఆడియన్స్ మధ్యలో చూడాలని తారక్ ఆశిస్తుండగా తారక్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.ఆర్ఆర్ఆర్ పై రోజురోజుకు భారీస్థాయిలో జక్కన్న అంచనాలను పెంచేశారు.

Telugu Career, Audience, Chirutha, Rajamouli, Ntr, Pan India, Ram Charan, Rrr, T

ఆర్ఆర్ఆర్ గురించి వస్తున్న ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ట్రైలర్ లో రివీల్ చేయని ఎన్నో అంశాలను జక్కన్న సినిమాలో చూపించబోతున్నారని ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా సినిమాలో చాలా సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.3 గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube