ఇండస్ట్రీలో భర్త చనిపోయి.. ఎప్పటికీ ఒంటరిగా మిగిలిన హీరోయిన్లు వీళ్ళే?

పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో వందేళ్ల పాటు కలిసి సంతోషంగా ఉండాలని కోరికతోనే ప్రతి యువతి పెళ్లి చేసుకుంటుంది.కానీ కొంతమందికి మాత్రం అనుకోని విధంగా ఇక వందేళ్ల పాటు తోడునీడగా ఉంటాడు అన్న భర్త దూరమైపోతూ ఉంటాడు చివరికి అతని జ్ఞాపకాల తోనే ఎంతోమంది బ్రతికేస్తూ ఉంటారు.

 Tollywood Heroines Who Lost Their Husband, Husband, Tollywood , Surekha, Meghan-TeluguStop.com

కేవలం సామాన్యులు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మందిప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్లు సైతం ఇలా భర్త దూరమై ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు.ఇక ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మేఘనారాజ్ :

కన్నడ నాట మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి సర్జా అకాల మరణం తర్వాత ఆయన భార్య మేఘనారాజ్ మరో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు.ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త జ్ఞాపకాలతో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

భానుప్రియ :

హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న భానుప్రియ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించింది.అయితే ఆదర్శ కౌశల్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయింది కానీ సంతోషంగా సాగిపోతున్న వీరి దాంపత్య జీవితంలో అనుకోని ఘటన.గొడవల కారణంగా భర్తతో దూరం అయింది.ఇక ఆ తర్వాత కొంత కాలానికి భానుప్రియ భర్త గుండెపోటు కారణంగా చనిపోయాడు.

Telugu Bhanu Priya, Dasaradha, Kavitha, Mandira Badi, Meghana Raj, Raj Kaushal,

సీనియర్ యాక్టర్ కవిత: టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కవిత భర్త దశరథను కరోనా వైరస్ బలితీసుకుంది.దీంతో ఆమె ఒంటరయిపోయింది.

మందిర బేడీ : బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మందిర బేడీ లేటు వయసులో చెక్కుచెదరని అందంతో ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటుంది.అయితే దర్శకుడు రాజ్ కౌశల్ను ఈమె పెళ్లి చేసుకుంది.

కానీ 50 ఏళ్ళ వయసులో దర్శకుడు రాజ్ కౌశల్ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు దీంతో ఈమె ఒంటరి గానే ఉంటుంది.

Telugu Bhanu Priya, Dasaradha, Kavitha, Mandira Badi, Meghana Raj, Raj Kaushal,

సురేఖ వాణి

: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈమె.సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.కానీ కొన్నాళ్ళకి సురేష్ తేజ అనారోగ్యంతో మృతి చెందారు.

ఇప్పటికి కూతురు కోసం పెళ్లి చేసుకోకుండా ఉంది సురేఖావాణి.

Telugu Bhanu Priya, Dasaradha, Kavitha, Mandira Badi, Meghana Raj, Raj Kaushal,

రేఖ : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన రేఖ.ఆ తర్వాత ఆడిలైట్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ను ప్రేమ వివాహం చేసుకుంది.మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి వేరు పడింది.

భర్త వ్యాపారం నిమిత్తం నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.

జయసుధ : ఇండస్ట్రీలో సహజనటిగా గుర్తింపు సంపాదించుకున్న జయసుధ నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇద్దరు కుమారులు కూడా ఉన్నారూ.కానీ అనుకోని కారణాలవల్ల నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.అప్పటి నుంచి జయసుధ పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా నే జీవిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube