ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఆయనకు భారీ బైక్, కార్ల ర్యాలీ తో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతూ రాజకీయ శత్రువులని నమ్మ వచ్చు కానీ, రాజకీయ ధ్రోహులని నమ్మకూడదని అన్నారు.రాజకీయ ద్రోహులు అంటే ఒకే పార్టీలో ఉండి, నమ్మక ద్రోహం చేసిన వారని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ సహాకారంతో పాలేరు నియోజక వర్గంలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని అన్నారు.మళ్లీ ఇంతటి ఘన స్వాగతం పలికిన వారి కోసం పాలేరు కి మళ్లీ నేనే వస్తానని అన్నారు.







