ముఖ్యంగా జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలు, ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తుంటాయి.రోజుకో కొత్త వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇందులో కుక్కలు, పిల్లులు, కోతులవి, తాబేళ్లకు చెందిన వీడియోలు ఉంటాయి.సాధారణంగా తాబేలు అనగానే హా.ఏం చేస్తుంది ? అది సాధు జంతువు కదా…? అని అంటుంటాం.అలాంటి తాబేళ్లు నీటిలోనూ, నేలపైనా నడుస్తాయి.
అయితే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.ఇటీవల ఇంటర్నెట్ వాడకం కూడా విపరీతంగా పెరగడంతో ఇలాంటి వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రపంచ నలుమూలలా ఏ వింత జరిగినా, ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ అవుతున్నాయి.ఇందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.
మరికొన్ని నమ్మలేని నిజంగా అనిపిస్తుంది.ఇలాంటి కోవకు చెందిన ఓవీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ చిన్నితాబేలు నడుస్తూ వెళ్తుంటుంది.దాని చుట్టూ అల్పాక జంతువులు చుట్టుముడుతాయి.ఒకదాని తరువాత ఒకటి విచిత్రంగా ఈ చిన్ని తాబేలును ఆశ్చర్యంగా చూస్తుంటాయి.ఒకానొక దశలో వాటి పొడవాటి ముక్కుతో తాబేలును ముట్టుకునే ప్రయత్నం చేస్తాయి.
ఇలా అన్ని అల్పాక జంతువులు చుట్టుముట్టడంతో తాబేలు తనకు తాను రక్షణకు ముడుచుకుంటుంది.

మళ్లీ నడవడం ప్రారంభిస్తుంది.వెంటనే అల్పాకలు ఈ చిన్నితాబేలును ముక్కుతో పట్టుకునే ప్రయత్నాలు మాత్రం ఆపవు.అయినా ధైర్యంతో తన గమ్యం చేరుకునేందుకు నెమ్మదిగా ముందుకు సాగుతుంది.
ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏమవుతుందోనన్న టెన్షన్ మాత్రం కలుగుతుంది.అందుకే ఈ వీడియో ను చూసిన నెటిజన్లు కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
క్యూట్ స్మాల్ టార్టాయీస్ అంటూ పొగిడేస్తున్నారు.మరికొందరైతే ఈ చిన్ని తాబేలుకు ధైర్యం ఎక్కువ.
బ్రేవ్ టార్టాయీస్ అంటు కామెంట్లు పెడుతున్నారు.మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.







