స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సమంత సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.
సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.అయితే తన లైఫ్ లో నందినీ రెడ్డి పాత్ర కీలకమంటూ సమంత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ నందినీరెడ్డి తన బలం, ధైర్యం, పోరాటానికి స్పూర్తి అని సమంత అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో దర్శకురాలు అనిపించుకోవడం సులువు కాదని నందినీ రెడ్డి మాత్రం ఓటమిని అంగీకరించకుండా సక్సెస్ అయ్యారని సమంత చెప్పుకొచ్చారు.
తన అలవాట్లు, నందినీ రెడ్డి అలవాట్లు ఒకే విధంగా ఉంటాయని ఆమె తెలిపారు.వృత్తిపై తమకు అపార గౌరవం ఉందని ఆమె కామెంట్లు చేశారు.
మేమిద్దరం ప్రతి ప్రాజెక్ట్ ను శ్రద్దతో చేయడంతో పాటు సీరియస్ గా చేస్తామని సమంత వెల్లడించారు.

ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి నూటికి నూరు శాతం కృషి చేస్తామని సమంత పేర్కొన్నారు.నందినీ రెడ్డి నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని సమంత తెలిపారు.నందినీ రెడ్డి మాటలతో తనను ఉత్సాహపరిచేదని ఆరోగ్యం బాలేకపోతే పరామర్శించేదని సమంత చెప్పుకొచ్చారు.
కష్ట సమయాలలో నందినీ రెడ్డి తనకు అండగా నిలబడిందని సమంత కామెంట్లు చేయడం గమనార్హం.

తను నటించే సినిమాల కథలు, పాత్రలను నందినీ రెడ్డి పరిశీలిస్తుందని సమంత చెప్పుకొచ్చారు.నందినీ రెడ్డి అనుభవంతో ఎన్నో విషయాలను వెల్లడిస్తుందని సమంత కామెంట్లు చేశారు.సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సమంత తన తరువాత సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.శాకుంతలం, యశోద ఫలితాలపై స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.







