గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ప్రతి ఒక్క రంగం కూడా ఎంతో అతలాకుతలం అయింది.ఈ క్రమంలోనే కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమ పై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి.
ఒకానొక సమయంలో థియేటర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.ఇలాంటి సమయంలోనే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ఎన్నో ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేశాయి.
ఈ క్రమంలోనే కరోనా కారణం వల్ల ఓటీటీ హవా పెరిగిపోయింది.
ఇలా ఇప్పటికే ఎన్నో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను సందడి చేస్తూ ఉండగా… తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా సొంతంగా ఓటీటీ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
చాలా సంవత్సరాల తర్వాత ఫఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి షారుక్ ఖాన్ సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా అభిమానులకు మరొక సర్ప్రైజింగ్ విషయాన్ని వెల్లడించారు.
షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘SRK + కమింగ్ సూన్’ పోస్టర్‌తో సొంతంగా ఓటీటీ సంస్థను ప్రారంభిస్తున్నట్లు షారుక్ హింట్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ లో ‘కుచ్ కుచ్ హోనే వాలా హై, ఓటీటీకి దునియా మే’ (ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది) అంటూ షారుఖ్ చేసిన ట్వీట్ బ్యాక్ డ్రాప్ లో SRK+ లోగో కూడా ఉంది.దీన్ని బట్టి చూస్తుంటే ఈయన త్వరలోనే సొంతంగా ఓటీటీ ప్రారంభిస్తున్నారని తెలియడంతో కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్‌తో సహా పలువురు సెలబ్రిటీలు షారుఖ్ ఈ వ్యాపారంలో కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ తనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా రాత్రికి పార్టీ కావాలని అడిగారు.







