తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతూ పెద్ద ఎత్తున రణరంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇక మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు రెండు రెండున్నర సంవత్సరాలలో జరగనున్న నేపథ్యంలో ఇక వ్యూహ, ప్రతివ్యూహ వ్యాఖ్యలకు పార్టీలు పదును పెడుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వం డబుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఒక ప్రచారంపై కెసీఆర్ తన అసెంబ్లీ ప్రసంగంలో భాగంగా స్పందించారు.డబుల్ ఇంజన్ గ్రోత్ పదంపై క్లారిటీ ఇచ్చారు.
డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే దానిని డబుల్ ఇంజన్ గ్రోత్ అంటారని, వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే సింగల్ గ్రోత్ అంటారని కెసీఆర్ తన ప్రసంగంలో భాగంగా వ్యాఖ్యానించారు.
ఇక తన ప్రసంగం కొనసాగింపుగా డబుల్ ఇంజన్ గ్రోత్ ప్రభుత్వం యూపీ రాష్ట్రంలో ఉందని, యూపీ అభివృద్దిని తెలంగాణ అభివృద్దితో పోలుస్తూ ఇక మాతా శిశుమరణాల విషయంలో, అప్పుల విషయంలో తెలంగాణ వృద్దిలో ఉన్నాయన్న విషయాన్ని డబుల్ ఇంజన్ గ్రోత్ ప్రచారం చేసే వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిదని కెసీఆర్ హితవు పలికారు.
అంతేకాక అవి డబుల్ ఇంజన్ గ్రోత్ రాష్ట్రాలు కాదని ట్రబుల్ ఇంజన్ రాష్ట్రాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.ఏది ఏమైనా ఇటు అసెంబ్లీలో కావచ్చు, బయట బహిరంగ సభల్లో బీజేపీ టార్గెట్ గా కెసీఆర్ విమర్శలు గుప్పిస్తూ రాజకీయాల్ని హీటెక్కిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కెసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఇంకా స్పందించకున్నా స్పందించే అవకాశం తప్పనిసరిగా ఉంది.ఏది ఏమైనా ఇక కెసీఆర్ బయట ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందిస్తారని అందరూ భావించినా కాస్త సాంప్రదాయ శైలికి విరుద్దంగా కెసీఆర్ స్పందించడం ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు.







