ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప పార్ట్ 1తోపాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ కు ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో మంచి విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ తన దృష్టిని పుష్ప పార్ట్ 2 పై ఉంచారు.ఇక ఈ సినిమా పై దర్శకుడు సుకుమార్ కూడా అదే స్థాయిలో దృష్టి ఉంచి అంతకు మించి అనేలా ఈ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణ పనులను ప్రారంభించనుంది.ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కాకుండానే భారీ ఎత్తున బిజినెస్ చేస్తూ లాభాలను తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం మైత్రి మూవీ మేకర్స్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా అన్ని భాషలలో శాటిలైట్ హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే అన్ని భాషలలో ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడం కోసం 250 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ఈ విధమైనటువంటి భారీ ఆఫర్ రాలేదు.మరి ఇలాంటి అద్భుతమైన ఆఫర్ రావడంతో మేకర్స్ ఈ ఆఫర్ ను స్వీకరించారా లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.ఇక ఈ సినిమా షూటింగ్ పనులను త్వరగా ప్రారంభించి ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలో ఈ సినిమా విడుదల చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.







