జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత పవన్ తనదైన మార్క్ రాజకీయాలతో ముందుకు సాగుతున్నాడనడంలో సందేహ పడాల్సిన పని లేదు.పక్కా ప్లాన్‌తోనే 2024 ఎన్నికల్లో సీఎం పీఠం కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
అందుకే పార్టీ ఆవిర్భావ సభలో గంటన్నర సేపు స్పీచ్ ఇచ్చారని టాక్.ఆమేరకు పొత్తులకు తాము సిద్ధమేనని వెల్లడించి ఓ కండిషన్ పెట్టారట.
ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.తాను ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తేగేసి చెప్పారు.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఏపీ వికాసం కోసం వ్యక్తిగత లాభాలు, ప్రయోజనాలు పక్కన పెట్టాలని, అందరూ చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు ఎవరైనా పొత్తుకు ముందుకొస్తే తాము సిద్ధమని పరోక్షంగా వెల్లడించారు.అంటే జనసేనకు ఇతర పార్టీల వారు కోరుకుంటే వారే మద్దతు ఇవ్వాలని దీని అర్థం.ఇక టీడీపీ కూడా అంతే….ఏపీ అభివృద్ధి కాంక్షిస్తే జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
ఎందుకంటే ఇంతకాలం టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిందని, ఇక నుంచి టీడీపీ మద్దతు ఇవ్వాలని కోరుతుండడం విశేషం.
ఆవిర్భావ సభలో పవన్ స్పీచ్ చూస్తే బీజేపీని వుదులుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది.2024 ఎన్నికల్లో బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారట.

ఇటీవల ఉత్తరాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది.దీనిని దృష్టిలో పెట్టుకుని పొత్తుల విషయాలు వెల్లడించినట్టు సమాచారం.అయితే బీజేపీ, జనసేన కూటమికి ఎవరైనా మద్దతు ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.
అదికూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ వాదన.ఇప్పటికే బీజేపీ కూడా పవనే సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించిన విషయం విధితమే.
మరి టీడీపీ భవిష్యత్ ఏంటి ? అంటే పొత్తులకు పోయినా జనసేనకే సపోర్ట్‌గా ఉండాలి.ఇక సీఎం అభ్యర్థి కూడా పవనే కాబట్టి టీడీపీ పల్లకి మోసే పనిలో ఉండాలని అర్థం చేసుకోవాలి.
సో పొత్తుకుదిరితే పవనే పెద్దన్న అవుతాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.







