జుట్టును స్మూత్‌గా, స్ట్రెయిట్‌గా మార్చుకోవడం కోసం చాలా మంది హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను వాడుతుంటారు.కానీ, ఈ స్టైలింగ్ టూల్స్ వల్ల జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.
అందుకే న్యాచురల్ పద్ధతుల్లోనే స్మూత్ అండ్ స్ట్రెయిట్ హెయిర్‌ను పొందడానికి ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా రెండు అరటి పండ్ల తొక్కలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కల్లో ఒక కప్పు పాలు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని పాలతో సహా అరటి పండు తొక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.
జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరటి తొక్కల జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూ.
స్లో ఫ్లేమ్‌పై ఉడికించుకోవాలి.క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి.
ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.బాగా కూల్ అయిన అనంతరం అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్‌సీడ్ జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.నలబై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా చేస్తే గనుక రఫ్‌గా నిర్జీవంగా ఉన్న జుట్టు స్మూత్ అండ్ స్ట్రెయిట్‌గా మారుతుంది.మరియు వారానికి ఒకసారి ఈ రెమెడీ ట్రై చేయడం వల్ల జుట్టు డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది.