వాహనం నంబర్ ప్లేట్‌పై ఉండే A/F గురించి మీకు తెలుసా?

వాహనం, కొత్తది లేదా పాతది అయినా, తప్పనిసరిగా మోటారు వాహనాల చట్టం 1989 ప్రకారం నమోదు అయివుండాలి.రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధంమైనదిగా పరిగణిస్తారు.

 Do You Know About The A F On The Vehicle Number Plate-TeluguStop.com

టూ వీలర్, త్రీ వీలర్ లేదా ఫోర్ వీలర్ వంటివి షోరూమ్ నుంచి బయటకు వెళ్లినప్పుడు తాత్కాలిక నంబర్ ఇస్తారు.వాహనానికి తాత్కాలిక నంబర్ ఇవ్వకపోతే, దాని నంబర్ ప్లేట్‌పై A/F అని రాసి ఉంటుంది.

A/F అంటే అప్లైడ్ ఫర్ అని అర్థం.వాహన యజమాని వాహనానికి కొత్త నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, శాశ్వత నంబర్ వచ్చే వరకు, అతనికి/ఆమెకు A/F అని ఇస్తారు.

నంబర్ ప్లేట్ లేదా అప్లైడ్ ఫర్ అని రాయడానికి అనుమతి ఉంటుంది.అయితే మీరు మీరు A/F నంబర్ ప్లేట్‌తో ఒక వారం కంటే ఎక్కువ కాలం పాటు వాహనాన్ని నడపటం చట్టవిరుద్ధం అవుతుంది.

ఎందుకంటే మీరు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేవరకూ వరకు మాత్రమే A/F రాసే సదుపాయాన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారి అందిస్తారు.మీరు పర్మినెంట్ నంబర్‌ను పొందిన వెంటనే, మీరు మీ వాహనంపై A/F బదులుగా శాశ్వత నంబర్‌ను రాయవలసి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడపడం నేరం.రిజిస్ట్రేషన్ లేకుండా డ్రైవింగ్ చేయడానికి అనుమతిలేదు.మీరు నంబర్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే, మీకు రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు మీ వాహనాన్ని కూడా జప్తు చేయవచ్చు.నిబంధనల ప్రకారం, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను వారంలోపు పొందాలి.అయితే నెల రోజులు గడుస్తున్నా ప్రజలు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించడం లేదని అధికారులు విచారణలో గుర్తించారు.చాలా సందర్భాలలో డీలర్ల తప్పు కనిపిస్తోంది.దాదాపు ప్రతి డీలర్ నిబంధనలను అతిక్రమించినట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల ట్రేడ్ సర్టిఫికేట్ రద్దు నోటీసు ఇచ్చే హక్కు ఆర్టీఓకి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube