ప్రపంచంలో ఉన్న పలు జీవరాశులు తమను రక్షించుకోవడం కోసం ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి,.అందులో ఒకటి బెలూన్ ఫిష్.
ఈ అరుదైన చేప మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి.శత్రువులెవరైనా దగ్గరికి వస్తే ఒక్కసారి గా బుడగలాగా ఉబ్బి ఇతరులను భయం గొలిపే విధంగా చేసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం.మండలం వాసాలతిప్ప లో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది.
ఇది అరుదైనా జాతి టెట్రాడాంటిడీ కి చెందినదని మత్స్యశాఖ అధికారులు వివరిస్తున్నారు.టెట్రాడాన్ గా వివరిస్తున్న ఈ చేప విషపూరితమైనదని దీనిలో ఉన్న విషం తో మనిషి ప్రాణానికే ప్రమాదకరమని మత్స్యశాఖ అధికారులు వివరిస్తున్నారు.







