ఆస్ట్రేలియాలో తెలంగాణా యువ టెకీ మృతి...!!!

ఎన్నో ఆశలతో, తల్లి తండ్రుల కలను నెరవేర్చాలనే కోరికతో దేశ కాని దేశం వెళ్ళిన హైదరాబాద్ కి చెందిన యువ టెకీ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది.తెలంగాణా రాష్ట్రం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ కి చెందిన సాయి సూర్య హైదరాబాద్ లోనే తన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

 Hyderabad Youth Sai Surya Died In Australia,australia,hyderabad ,australia Educ-TeluguStop.com

ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉండటంతో తల్లి తండ్రుల ప్రోత్సాహంతో 2019 లో ఆస్ట్రేలియా లో ఏంఎస్ చేయడానికి వెళ్ళాడు.అక్కడ చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా సంపాదించాడు.రెండు నెలల క్రితమే సాయి సూర్య ఉద్యోగంలో చేరాడు.

2020 ఏడాది లో సాయి సూర్య ఓ భారీ ప్రమాదానికి గురవ్వడంతో అతడి కాలికి తీవ్ర గాయమయ్యింది అదే సమయంలో కరోన ఆంక్షలు ఉండటంతో సాయి ఇక్కడికి రాలేకపోయాడు, తల్లి తండ్రులు సాయి వద్దకు వెళ్లేందుకు అనుమతులు కూడా లేవు దాంతో కొడుకుని కేవలం వీడియో కాల్ లో మాత్రమే చూసుకుని బాధపడే వారు, ఇదిలాఉంటే సాయి కాలుకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రమాదమని చెప్పడంతో వైద్యుల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్దమయ్యారు.దాంతో తల్లి తండ్రులు సాయి దగ్గర ఉండేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు.ఇంకా కొన్ని రోజుల్లో ప్రయాణం ఉందనగా

సాయి ప్రమాదవశాత్తు మృతి చెందాడనే వార్త వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

ఈ నెల 7 వ తేదీన ఆస్ట్రేలియాలోని రివర్ వ్యూ హోటల్ లో గోల్డ్ కోస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర యోగా చేసుకుంటున్న క్రమంలో ఒక్క సారిగా నీళ్ళలోపడిపోయాడని ఈ క్రమంలోనే సాయి సూర్య మృతి చెందాడని స్నేహితులు తెలిపారు.కొడుకు ఆపరేషన్ కోసం ప్రయాణానికి సిద్దమయిన తల్లితండ్రులు అతడి మరణ వార్త విని పడుతున్న ఆవేదన ప్రతీ ఒక్కరిని కంట నీరు పెట్టించింది.

సాయి సూర్య మృత దేహాన్ని త్వరలో స్వగ్రామానికి తరలించనున్నారని తెలుస్తోంది.

Hyderabad Youth Sai Surya Died In Australia

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube