అనుకోకుండా రామ్ చరణ్ సినిమాకి భారీగా కలిసొచ్చిన అదృష్టం... ఏమిటంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికీ ఈయన నటించిన ఆచార్య, RRR సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 Unexpectedly Luck To The Ram Charan Movie Do You Know What Is It Ram Charan, Tol-TeluguStop.com

ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపు కుంటుంది.ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ల రేట్లు గురించి పలు విమర్శలు చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది.

ఈ జీవో ప్రకారం 20 శాతం సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటే ఆ సినిమాకి పెరిగిన టికెట్ ధరలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం ఈ విధమైనటు వంటి జీవో విడుదల చేయక ముందే రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నారు.

ఇలా అను కోకుండా రామ్ చరణ్ సినిమా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరగడం కొత్త జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోనే షూటింగ్ జరుపుకుంటుంటే పెరిగిన సినిమా టికెట్ల ధరలు వర్తిస్తాయని చెప్పడంతో అనుకోకుండా ఈ అదృష్టం రామ్ చరణ్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.ఇక రామ్ చరణ్ తన 15 వ చిత్రానికి పెరిగిన టికెట్ ధరలు వర్తించ నున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే వెకేషన్ లో ఉన్నారు.హాలిడే వెకేషన్ పూర్తి కాగానే సరాసరి రామ్ చరణ్ RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube