ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూసిన రాధేశ్యాం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గత మూడు సంవత్సరాలుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన రాధేశ్యామ్ ఎట్టకేలకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది.
ఈ మధ్య కాలం లో ఏ ఇండియన్ సినిమా కు దక్కని అరుదైన రికార్డు లను ఈ సినిమా సొంతం చేసుకుని అత్యధిక థియేటర్ల లో విడుదల అవడం తో భారీ ఓపెనింగ్స్ ఖాయమంటూ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో తెలుగు మరియు ఇతర సౌత్ భాషల్లో వసూళ్ళ విషయానికి వస్తే కాస్త నీరసంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు.
అంటే క్లాస్ అభిమానులకు పర్వాలేదనిపించినా బి సి ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా కాస్త ఎక్కక పోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది.
గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా కూడా ఇదే తరహా టాక్ దక్కించుకుంది.
దాంతో తెలుగు లో కంటే సాహో సినిమా ఉత్తరాదిన భారీ వసూళ్ల ను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా అర కొర వసూళ్లను దక్కించుకుంటే ఉత్తరాదిన మాత్రం అనూహ్యంగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.
ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా కూడా ఉత్తరాది లోనే అత్యధిక వసూళ్లను దక్కించుకుంటుంది అనే టాక్ వినిపిస్తోంది.సినిమా మేకింగ్ స్టైల్ మరియు ఇతర విషయాలను చూస్తుంటే ఇది ఉత్తరాది ప్రేక్షకుల కోసమే అన్నట్లుగా ఉంది అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి.
మొత్తానికి సౌత్ లో వసూళ్లు ఎలా ఉన్నా ఉత్తరాదిన మాత్రం వసూళ్లు భారీగా నమోదు అయ్యి బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ స్టార్ డమ్ ను బాలీవుడ్ లో ఈ సినిమా మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.







