ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సైతం రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి.పుష్ప సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి రావడంతో కలెక్షన్లపై ఎఫెక్ట్ పడిందనే సంగతి తెలిసిందే.
అఖండ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.భీమ్లా నాయక్ సినిమా ఈ నెల చివరి వారం నుంచి ఓటీటీలో అందుబాటులోకి రావచ్చని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
డీజే టిల్లు సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ రిలీజైన 90 రోజుల వరకు ఓటీటీలో అందుబాటులోకి రాదు.ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటీటీలో చూడాలని భావించే వాళ్లకు మాత్రం ఇది నిరాశే అని చెప్పాలి.

50 రోజుల తర్వాత కూడా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతుంటే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన 100 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉంటాయి.ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ హక్కులు జీ5 దగ్గర ఉన్నాయి.అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఓటీటీలతో పోల్చితే ఈ ఓటీటీకి రీచ్ తక్కువనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ తో సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని ఈ ఓటీటీ భావిస్తోంది.ఆర్ఆర్ఆర్ మేకర్స్ నిర్ణయంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.ఆలస్యంగా స్ట్రీమింగ్ కు రావడం వల్ల ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ కలెక్షన్లు అంచనాలకు మించి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.







