మ‌ధుమేహం ఉన్న‌వారిలో అధిక ఆక‌లిని త‌గ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

ఇటీవ‌ల రోజుల్లో మ‌ధుమేహం(షుగ‌ర్ వ్యాధి) బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది.వ‌య‌సు పైబ‌డిన వారే కాదు.

యంగ్ ఏజ్‌లో ఉన్న వారు సైతం ఈ వ్యాధికి గుర‌వుతున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, పలు ర‌కాల మందుల వాడ‌కం, ఒకే చోట‌ గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంటుంది.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ ఒక్క‌సారి షుగ‌ర్ వ్యాధి వ‌చ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది.అలాగే ఎన్నో స‌మ‌స్య‌ల‌నూ ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా మ‌ధుమేహం వ్యాధిగ్ర‌స్తుల‌ను అధిక ఆక‌లి తీవ్రంగా వేధిస్తుంటుంది.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

మరి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.క్యారెట్‌అద్భుత‌మైన దుంప‌ల్లో ఇది ఒక‌టి.

ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే క్యారెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందులోనూ మ‌ధుమేహం ఉన్న వారు రోజుకు ఒక క్యారెట్ తీసుకుంటే అధిక ఆక‌లి స‌మ‌స్య దూరం అవ్వ‌డంతో పాటు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు సైతం నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల్లో అధిక ఆక‌లిని త‌గ్గించ‌డానికి పెరుగు సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.కొవ్వు త‌క్కువ‌గా ఉండే పెరుగును ఒక క‌ప్పు చ‌ప్పున‌ రోజూ తీసుకుంటే గ‌నుక ప‌దే ప‌దే ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది.

అధిక ఆక‌లి స‌మ‌స్య‌ను నివారించ‌డానికి చేప‌లు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.వారంలో క‌నీసం రెండు సార్లు చేప‌లు తింటే మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక ఇవే కాకుండా తృణధాన్యాలు, యాపిల్ పండ్లు, మెంతి టీ, గ్రీన్ టీ, అవిసె గింజ‌లు, స‌లాడ్స్‌, గుమ్మ‌డి గింజ‌లు, కీర‌దోస‌ వంటి ఆహారాలు సైతం అధిక ఆక‌లిని త‌గ్గిస్తాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కాబ‌ట్టి, మ‌ధుమేహం ఉన్న వారు ఈ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మంచిద‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు