సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
తాతలు తండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూనే వుంటారు.ఇకపోతే.
అన్నదానానికి పేరొందిన సిక్కుల గురుద్వారాలు కొవిడ్ బాధితుల కోసం లక్షలాది మందికి కడుపు నింపాయి.ప్రత్యేకంగా ‘లంగర్’లను నిర్వహిస్తూ ఇళ్లూ ఆస్పత్రుల వద్దకే ఆహారాన్ని తీసుకెళ్లి అందించారు సిక్కులు.
తాజాగా యూకేలోని బర్మింగ్‌హామ్ నగరంలోని సిక్కు విద్యార్ధులు.తమ సంప్రదాయాన్ని అనుసరించి 500 మందికిపైగా ఉచిత భోజనాన్ని అందించారు.బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్, దాని అనుబంధ సిక్కు సోసైటీలు మంగళవారం మిలీనియం పాయింట్‌లోని కర్ణికలో ‘‘లంగర్ ఆన్ క్యాంపస్’’ని నిర్వహించాయి.లంగర్ అంటే పంజాబీ భాషలో వంటగది అని అర్ధం.
సిక్కు సంప్రదాయంలో దీనికి ఎనలేని ప్రాధాన్యత వుంది.ఇక్కడ హాజరైన ఎవరికైనా ఉచితంగా ఆహారం అందిస్తారు.
లంగర్ ఆన్ క్యాంపస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వున్న యూనివర్సిటీలలో సిక్కు విద్యార్ధులు నిర్వహించే కార్యక్రమం.ఇక్కడ ఎన్నో రకాల నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్ధులు, సిబ్బంది, కమ్యూనిటీ సభ్యులు కలిసి భోజనం చేస్తారు.

యూకేలోని బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీలో భారీ ఎత్తున లంగర్ నిర్వహించడం ఇది ఐదవసారి, కోవిడ్ వెలుగులోకి వచ్చిన రెండేళ్లలో ఇది తొలిసారి.గురువారం జరిగిన లంగర్ ఆన్ క్యాంపస్ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా ప్రజలు భోజనాన్ని ఆస్వాదించారు.ఈ సందర్భంగా సిక్కు మత విశ్వాసం గురించి మరింత అవగాహన పొందారని యూనివర్సిటీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీ సిక్కు సొసైటీ ప్రెసిడెంట్ రాజ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.
ఐదవసారి లంగర్ ఆన్ క్యాంపస్ ఈవెంట్‌ను నిర్వహించడం ఆనందంగా వుందన్నారు.మతపరమైన వేడుకలకు అన్ని నేపథ్యాల ప్రజలను స్వాగతించడం సంతోషంగా వుందన్నారు.
అయితే కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారని రాజ్‌వీర్ చెప్పారు.







