యూట్యూబ్ స్టార్స్ గా గుర్తింపు దక్కించుకున్న దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ జస్వంత్ లు ప్రేమలో మునిగి తేలారు.ఎంతో మందికి వీరి ప్రేమ ఆదర్శంగా నిలిచింది.
యూట్యూబ్ లో వీరి పాటలకు మరియు వీరి పై వచ్చిన మీమ్స్ కు విపరీతమైన వ్యూస్ ఉంటాయి.అంతటి ప్రేమాయణం సాగించిన వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడిపోయిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ మళ్లీ కలుస్తారు అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు.గతంలో రెండు సార్లు వీరిద్దరు బ్రేకప్ అయ్యారు.
ఆ సమయం లో కలిశారు కనుక మళ్ళీ వీరిద్దరూ కలుస్తారా అనే వాదన చాలా మంది చేస్తున్నారు.ముఖ్యంగా గత రెండు వారాలుగా వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరు కలిసి కలవబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.

దీప్తి సునయన ను కలిసి షణ్ముక్ తన ప్రేమను మరో సారి తెలియజేస్తాడు అంటూ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది.కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీప్తి సునైనా మరియు షన్నూల మధ్య ఎలాంటి చర్చలు జరగ లేదు.షన్నూ వెళ్లి దీప్తి సునైన ని కలవబోతున్నట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది.
వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కూడా సన్నగిల్లుతుంది. షణ్ముఖ్ జస్వంత్ మరో వైపు తన వర్క్ లో బిజీ అయ్యాడు.ఇటీవలే తన కొత్త ఇంట్లో అడుగు పెట్టిన ఇతడు తాజాగా స్టార్ మా లో ప్రసారమైన ఒక షోలో అదరగొట్టేశాడు.వాలెంటైన్స్ డే సందర్భంగా టెలికాస్ట్ అయిన ఆ షో కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
షన్ను డాన్స్ పర్ఫార్మెన్స్ ని కూడా ప్రతి ఒక్కరూ అభినందించారు.ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి కామన్ అభిమానులు ఎప్పుడెప్పుడు వీరు కలుస్తారా అని ఎదురు చూస్తున్నారు.
కానీ వారి ఆశలు నెరవేరే అవకాశాలు మాత్రం కనిపించలేదు.వీరిద్దరు ఎప్పటికి కలవరు అనే చర్చ ఎక్కువగా వినిపిస్తుంది.







