వచ్చిన కరోనా పోవడం చూశాం, కానీ అతనికి సోకిన కరోనా ఇక పోవడం కుదరదట!

అవును మీరు వింటున్నది నిజమే.అతనికి సోకిన కరోనా ఇక పోవడం కుదరదని డాక్టర్లు తేల్చి చెప్పేశారట.

 We Saw The Corona Coming And Going , But The Infected Corona Was About To Leav-TeluguStop.com

కరోనా రక్కసి ప్రపంచ దేశాలను ఎలా గజ గజ లాడించిందో, ఆడిస్తుందో చూశాం.నేటికీ చూస్తూనే వున్నాం.

కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి, కంటికి కనిపించే అతి పెద్ద భారీ కాయాన్ని అంటే మనిషిని పెగెత్తిస్తోంది.నేటికీ ఎంతోమంది దీనివలన బాధింపబడినవారు వున్నారు.

కొంతమంది ప్రాణాలు కోల్పోతే, మరికొంత మంది ప్రాణాలను తమ గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు.ఏది ఏమైనా ఓ సారి సదరు బాధితుడికి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందంటే అతనిలో కరోనా మూలాలు ఇక లేనట్టే.

కానీ ఇక్కడ అలా జరగలేదు.

అసలు విషయంలోకెళ్తే… టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్‌కి గతేడాది నవంబర్‌ 2020న కరోనా సోకింది.

అందువలన కయాసన్‌ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.తరువాత కొన్ని రోజులకి అతడు కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఒకటి రెండు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది.దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

కయాసన్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు లోతుగా విచారించగా.అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది.ఇది ఒకరకమైన బ్లడ్‌ కేన్సర్‌.ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికి సహాయపడే తెల్లరక్తకణాలు విపరీతంగా తగ్గిపోవడమే కాక, వ్యాధినిరోధక శక్తి పూర్తిగా క్షీనిస్తుంది.

ఇక దాని వలనే కయాసన్‌ శరీరం నుంచి కరోనా వైరస్‌ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు తేటతెల్లం చేసారు.

We Saw The Corona Coming And Going , But The Infected Corona Was About To Leave , Carona Positive , Latest Viral , News Social , Media Viral , Latest News , Doctors , Negative In Tests , Muzaffar Kayasan‌ - Telugu Carona, Doctors, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube