మిస్ వరల్డ్- మిస్ యూనివర్స్ మధ్య తేడా ఏమిటో తెలుసా?

ఆమధ్య ఇజ్రాయెల్‌లో జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీలో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు విజయం సాధించి చరిత్ర సృష్టించింది.భారత్ నుంచి ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో మహిళగా రికార్డు సృష్టించింది.

 Do You Know The Difference Between Miss World And Miss Universe , Miss Universe,-TeluguStop.com

అదే సమయంలో జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ ఈ సారి ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యింది.ఈ రెండు పోటీలు ప్రపంచంలోని అందమైన మహిళలను గుర్తిస్తాయి.

అయితే ఈ పోటీల మధ్య వ్యత్యాసం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఆ తేడాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వ సుందరి: ఈ పోటీ 1952లో ప్రారంభమైంది.ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ నగరంలో ఉంది.

ప్రపంచంలో సానుకూల మార్పు కోసం పని చేయండనేది ఈ పోటీ నినాదం.దీని అధ్యక్షుడు పౌలా షుగర్ట్.ఫిన్లాండ్‌కు చెందిన ఆర్మీ కుసేలా తొలిసారి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది.1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు భారత్ నుంచి టైటిల్ గెలుచుకున్నారు.ప్రపంచ సుందరి: ఈ పోటీ 1951లో ప్రారంభమైంది.ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఉంది.‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ లక్ష్యంగా పనిచేస్తుంది.దీని అధ్యక్షురాలు జూలియా మోర్లీ.1951లో స్వీడన్‌కు చెందిన కికీ హెకెన్‌సెన్ తొలి ప్రపంచ సుందరి.భారతదేశానికి చెందిన 6 మంది మహిళలు మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు, వీరిలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్ ఉన్నారు.

Do You Know The Difference Between Miss World And Miss Universe , Miss Universe, Miss World, Difference - Telugu Difference, Universe

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube