పాత్రకు తగిన విధంగా మారి సినిమా సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమించే స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, సన డైరెక్షన్ లో వరుసగా మూడు సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే బుచ్చిబాబు డైరెక్షన్ లో తారక్ నటించే పాత్ర స్పెషల్ గా ఉండనుందని సమాచారం.దర్శకుడు బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అనే సంగతి తెలిసిందే.
పుష్ప సినిమాలో బన్నీని పుష్పరాజ్ పాత్రలో లోపం ఉన్న వ్యక్తిగా సుకుమార్ చూపించారు.
అదే విధంగా బుచ్చిబాబు సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక లోపంతో బాధపడే వ్యక్తిగా కనిపిస్తారని సమాచారం అందుతోంది.
సుకుమార్ సూచనల మేరకు బుచ్చిబాబు ఎన్టీఆర్ పాత్రను ఈ విధంగా క్రియేట్ చేశారని ప్రచారం జరుగుతోంది.మరోవైపు మేకర్స్ ఈ సినిమా కొరకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
కబడ్డీ ప్లేయర్ గా ఈ సినిమాలో తారక్ కనిపిస్తారని తన లోపమే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆటలో విన్నర్ గా నిలవడానికి ఉపయోగపడేలా కథను రూపొందించారని సమాచారం.ఒకే సమయంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా, బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న బుచ్చిబాబుకు రెండో సినిమాతో ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.

ఉప్పెనతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న బుచ్చిబాబు రెండో సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఎన్టీఆర్ సినిమాతో బుచ్చిబాబు కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.








