సిద్ధూ, నేహా శెట్టి జంటగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందిన డీజే టిల్లు సినిమా విడుదలకు సిద్ధమైంది.ఈ ఫిబ్రవరి లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయాలని భావించిన కూడా హడావుడి రిలీజ్ ఎందుకు అనే ఉద్దేశం తో ఈ నెలకు వాయిదా వేయడం జరిగింది.ఈ నెలలో విడుదల ఎప్పుడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.
కానీ ఈ నెలలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం తో విడుదల విషయం పై మరింత క్లారిటీ వచ్చినట్లు అయిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
డీజే టిల్లు సినిమా మరో అర్జున్ రెడ్డి లెవెల్ లో ఉంటుంది అంటూ మొదటి నుంచి యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే అదే విధంగా ఉండబోతుంది అనిపిస్తుంది.
హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమా లో రాధిక అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది.ట్రైలర్స్ లో చూపించిన దాని ప్రకారం హీరోయిన్ కేవలం హీరో తో మాత్రమే కాకుండా ముగ్గురు నలుగురు తో కూడా రొమాన్స్ చేస్తున్నట్లు గా చూపించారు.
సినిమా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.పలు సందర్భాల్లో హీరోయిన్ వల్ల హీరో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు.

హీరోయిన్ అసలు విషయం తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటాడు.హీరోయిన్ నెగటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయా? లేదంటే కావాలని అలా స్క్రీన్ ప్లే లో డ్రామా క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.ఈ సినిమా లో డైలాగ్స్ ను సిద్దు రాశాడు.చాలా మాస్ గా కూల్ గా సింపుల్ గా ఆయన రాసిన డైలాగ్స్ ఉన్నాయి.మోసం చేస్తే తెలియకుండా చేయాలి… బనియన్ కు తెలియకుండా డ్రాయర్ ని లాగినట్టుగా మోసం చేయాలి అంటూ సిద్దు చెప్పే డైలాగ్స్ చాలా ఫన్నీగా మరియు ఆలోచించే విధంగా ఉన్నాయంటూ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.డీజే టిల్లు యూత్ ఆడియన్స్ ని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని ఈ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.

ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒకటి రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.భీమ్లా నాయక్ వంటి భారీ సినిమాను తెరకెక్కించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు డీజే టిల్లు సినిమాను నిర్మించడం వల్ల భారీగా అంచనాలు ఉన్నాయి.ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







