నందమూరి బాలకృష్ణ ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ షో సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఈ షో వల్ల బాలకృష్ణ తెలుగు ఆడియెన్స్ కు ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ ఇంకా డిజిటల్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు.
అన్ స్టాపబుల్ షో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.అన్ స్టాపబుల్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ మరో వారం రోజుల్లో రానుంది.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చారు.ఆల్రెడీ దీనికి సంబందించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది.
ఇక మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన అన్ స్టాపబుల్ ఏమాత్రం లేట్ చేయకుండా సెకండ్ సీజన్ షురూ చేయాలని చూస్తున్నారట.
ఆహా టీం మొదటి సీజన్ కి ఇచ్చినట్టుగానే సెకండ్ సీజన్ కోసం బాలయ్యకి కోట్ చేశారట.
కానీ అన్ స్టాపబుల్ షో ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువ రిటర్న్ రావడంతో బాలయ్య కూడా తన థింకింగ్ మార్చుకున్నాడట.మొదటి సీజన్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ కి డబుల్ ఇస్తేనే సెకండ్ సీజన్ చేస్తానని అంటున్నారట.
బాలయ్య బాబు రెమ్యునరేషన్ పెంచి ఆహా టీం కి షాక్ ఇచ్చారని టాక్.అయితే ప్రస్తుతం సీజన్ 2కి సంబందించిన చర్చలు జరుగుతున్నట్టు టాక్.







