రూ.100 కోట్ల రెమ్యునరేషన్ నాకు ఎవరు ఇస్తున్నారు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాలకు ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ను రామ్ చరణ్ క్యాష్ చేసుకుంటున్నారని తన తరువాత రెండు సినిమాలకు చరణ్ ఏకంగా 200 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

అయితే ఈ వార్తల గురించి చరణ్ స్పందించి స్పష్టతనిచ్చారు.తనకు 100 కోట్ల రూపాయల పారితోషికం ఎవరిస్తున్నారని చరణ్ కామెంట్లు చేశారు.

అసలు వంద కోట్లు ఎక్కడున్నాయని ఉన్నా ఎవరిస్తారంటూ చరణ్ కామెంట్లు చేయడంతో చరణ్ పారితోషికం గురించి వచ్చిన వార్తలు పుకార్లేనని తేలిపోయింది.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ మాత్రమే 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పాన్ ఇండియా హీరో కాబట్టి ప్రభాస్ కు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు.చరణ్ గత సినిమా వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

Advertisement

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.

చరణ్ తన సినిమాల కోసం ఎంతో కష్టపడతారు.చరణ్ రెమ్యునరేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా సందర్భాల్లో చెప్పారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు చరణ్ ఏకంగా 45 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.శంకర్ సైతం ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో దర్శకునిగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.చరణ్ సినిమాతో శంకర్ కోరుకున్న భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

సినిమాసినిమాకు చరణ్ కు క్రేజ్ పెరుగుతోంది.చరణ్ ఆర్ఆర్ఆర్ రిజల్ట్ ను బట్టి రెమ్యునరేషన్ ను పెంచే అవకాశాలు ఉన్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement
" autoplay>

తాజా వార్తలు