టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించిన విషయం తెలిసిందే.ఎప్పుడూ కూడా తెరవెనుక మాత్రమే ఉండేవారు.
అతనికి తెరపై నటించడానికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఏ రోజు కూడా నటించలేదు.సినిమాలలో పాటలు రాసే సమయంలో గురువుగారు మీరు ఎందుకు నటించకూడదు అంటూ చాలా మంది దర్శకులు అడిగారట.
కానీ ఎంత మంది దర్శకులు తన దగ్గరికి వచ్చి నటించాలని కోరినప్పటికీ అతను తెర వెనుక మాత్రమే పాటలు రాస్తాను కానీ తెర మీద మాత్రం నటించను అంటూ సున్నితంగా తిరస్కరించేవారట. కానీ సిరివెన్నెల దర్శకుల మీద ఉన్న గౌరవంతో ఒక సినిమాలో నటించారట.
ఆ సినిమా పేరు గాయం.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన గాయం సినిమాలో నటించారట.1993లో విడుదలైన ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా నటించారు.అది కేవలం వర్మ పై ఉన్న అభిమానంతో మాత్రమే చేశారు.

పైగా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ తనదైన శైలిలో పాట రాసి అందులో అభినయించారు.ఈ పాట తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన విప్లవ గీతంగా మారిపోయింది.మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకునే విధంగా ఈ పాట రాశారు సీతారామశాస్త్రి.గాయం సినిమా తర్వాత చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో కూడా నటించాలి అంటూ సిరివెన్నెలను ఎన్నోసార్లు కాస్త బలవంతపెట్టారు.
అందులో పెద్ద పెద్ద దర్శకులు ఎంత మంది వచ్చి తనను అడిగినా తనకు నటన రాదు అని చెప్పేవారట.