ఏపీలో ఇప్పుడు రాజకీయ వేడి ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే.మొన్నటి దాకా బద్వేల్ ఉప ఎన్నిక ఓ పెద్ద వార్త అనుకునే లోపే తిట్ల పురాణమే పెద్ద దుమారం లేపేసింది.
ఏకంగా జగన్, చంద్రబాబు లాంటి వారు కూడా వాటిని ప్రస్తావిస్తూ రాజకీయాలు చేసే దాకా వెళ్లింది వ్యవహారం.ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది.
దీంతో మళ్లీ అందరి చూపు అటువైపు మళ్లింది.అయితే టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న ఘర్షణలను సైలెంట్ గా గమనిస్తున్న పవన్ కల్యాణ్ తన వ్యూహం ఏంటో ఎవరికీ చెప్పట్లేదు.
ఇంకోవైపేమో బద్వేలులో పవన్ మీదనే ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తోంది బీజేపీ పార్టీ.30న ఎన్నికలు ఉన్న సమయంలో ప్రచార జోరు మాత్రం ఇంకా ఊపందుకోలేదు.రాజకీయ విలువలు పాటిస్తూ టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్న విషయం అందరికీ విదితమే.ఇలాంటి తరుణంలో బీజేపీ తమకు జనసేన అధినేత పవన్ అండ దొరుకుతుందని భారీగానే ఆశలు పెట్టుకుంది.
త్వరలోనే పవన్ ఇక్కడ బీజేపీ తరుపున ప్రచారానికి కూడా వస్తారని ఆశిస్తున్న బీజేపీకి పవన్ మౌనం షాక్ ఇస్తోంది.ఎందుకంటే ఇప్పటి దాకా పవన్ ఆయన నిర్ణయం ఏంటో తెలుపలేదు.

ఆల్రెడీ సమయం కూడా దగ్గర పడుతుండటంతో ఇక పవన్ ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారనే వాదన తెరమీదకు వస్తోంది.ఇప్పటి దాకా ప్రచారానికి వచ్చే విషయమై ఎలాంటి ప్రకటన చేయకపోవడం బీజేపీకి పెద్ద దెబ్బ అయిపోయింది.ఇక పవన్ ఉప ఎన్నికకు దూరం పాటిస్తున్నట్టు తెలుస్తోంది.
గత తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బాగానే ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం పెద్ద మైనస్ గా మారిపోయింది.ఇప్పటికే టీడీపికి పవన్ సపోర్టు చేస్తున్నారనే ప్రచార నేపథ్యంలో ఆయన మౌనం బీజేపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.