న్యూస్ రౌండప్ టాప్ 20

1.చిరు ను కలుస్తా : మంచు విష్ణు

సినీ పరిశ్రమలోని పెద్దలు అందర్నీ కలుపుకుని  వెళ్తానని మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు.

త్వరలోనే మెగా స్టార్ చిరంజీవి ని కలుస్తాను అంటూ విష్ణు ప్రకటించారు. 

2.నెహ్రూ జూ పార్క్ కు కంగారులు

  హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ కి త్వరలోనే రెండు కంగారులు జపాన్ నుంచి రానున్నాయి. 

3.ఆర్యన్ ఖాన్ కు కరోనా పరీక్షలు

  డ్రగ్స్ కేసులో అరెస్ట్ ఆయిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో పాటు ఇతరులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 

4.భారత్ లో మరో కొత్త బ్యాంక్

  దేశంలో మరో కొత్త బ్యాంక్ ఏర్పాటుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత్ పే కన్సర్షియం కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. 

5.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. 

6.తెలంగాణ హై కోర్టు కు కొత్త జడ్జిలు

  తెలంగాణ హైకోర్టు కొత్తగా ఏడుగురు జడ్జీలు రానున్నారు.ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన విజ్ఞప్తికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

7.కిమ్ పై జపాన్ కోర్టు లో కేసు

Advertisement

  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పై జపాన్ లోని టోక్యో కోర్టు లో కేసు నమోదు అయ్యింది.స్వదేశానికి తిరిగి వెళ్లే రిపాట్రియేషన్ పథకం పై కేసు నమోదు అయ్యింది. 

8.ఎస్ బీ ఐ లో ఉద్యోగ అవకాశాలు

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 606 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

9.డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

  బీఆర్ అంబేత్కర్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, ఎంబిఎ కోర్సులో ప్రవేశానికి గడువును పొడిగించారు. 

10.దుర్గమ్మను దర్శించుకున్న నటి హేమ

  ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ ను సినీ నటి హేమ దర్శించుకున్నారు. 

11.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

12.తెలంగాణలో కరోనా

  గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

13.ఏపీలో కరోనా

  గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

14.విద్యుత్ శాఖ కార్యదర్శిగా సునీల్ శర్మ

  తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సునీల్ శర్మ నియమితులు అయ్యారు. 

15.నేటి నుంచి నాలుగు రోజులు టీకా బంద్

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

  దసరా ను పురస్కరించుకుని నేటి నుంచి నాలుగు రోజుల పాటు కరోనా వాక్సిన్ ను పంపిణీని నిలిపివేయనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

16.బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన ఏ ఆర్ రెహమాన్

  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 

17.మాజీ ఎమ్మెల్యే మృతి

Advertisement

  ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్మ పిచ్చిరెడ్డి మృతి చెందారు. 

18.స్పింటర్ హిమదాస్ కి కరోనా

  భారత స్టార్ స్పింటర్ హిమదాస్ కరోనా వైరస్ ప్రభావం కి గురయ్యారు. 

19.కరోనా బాధితులకు 5 వేల పెన్షన్

  కరోనా బారినపడిన నిరుపేద కుటుంబాలకి నెలకి ఐదు వేల పెన్షన్ ఇవ్వబోతున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,700   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,760.

తాజా వార్తలు