ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్...పునర్వైభవం కోసమేనా?

ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక హడావిడి నెలకొన్న విషయం తెలిసిందే.

ఇక ఈ ఉప ఎన్నికలో విజయం కోసం అన్ని పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే అయితే కాంగ్రెస్ పోటీలో ఉండదని చాలా మంది అనుకున్నా కాని చివరికి అభ్యర్థిని ప్రకటించి ఒక్కసారిగా సంచలనం రేపింది.అయితే చాలా ప్రస్తుతం చాలా వరకు అందరి చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది.

ఎంతవరకు కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్ ల ఓట్ల శాతం మీద ఎంతలా ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత చాలా దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది.

ఇది కాంగ్రెస్ కు మంచి పరిణామం అయినా చాలా జాగ్రత్తగా అడుగులేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ప్రజలకు పరిచయం లేని వ్యక్తి అయినా అక్కడ కాంగ్రెస్ కి టీఆర్ఎస్ తరువాత రెండో స్థానం ఉండటంతో కాంగ్రెస్ తన పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అడుగులేస్తుందని మనకు తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా అర్ధమవుతోంది.

Advertisement

అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే అది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ విజయంపై ఫోకస్ చేస్తున్నదని అర్ధమవుతోంది.అయితే  రాష్ట్రమంతా     ఇప్పుడు హుజూరాబాద్ పై కాంగ్రెస్ జెండా ఎగిరితే ఇక మరల బీజేపీ ఎదగడానికి అవకాశం ఉండదు.

ప్రస్తుతానికి కాంగ్రెస్ శిబిరం విజయంపై ఏమీ స్పందించకపోయినా సైలెంట్ వ్యూహంతో వెళ్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోయినా ఇతర పార్టీ ఓట్లను మాత్రం చీల్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు