ఆడవాళ్లు వంట గదిలో వంట చేస్తున్నప్పుడు చేతులు, కాలడం అనేది సర్వ సాధారణమైన విషయం.అసలు వంట అంటే తెలియని వారు కొత్తగా వంట నేర్చుకునేటప్పుడు చేతులు కాల్చుకోవడం, లేదంటే నూనె పైకి చింది చర్మం మీద పడడం లాంటి సంఘటనలు చాలానే జరుగుతూ ఉంటాయి.
ఒక్కోసారి వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.ఎందుకంటే నిప్పుతో చెలగాటం అంటే మాములు విషయమా చెప్పండి.
అందుకే మన పెద్దవాళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు.వంట గదిలో వంట చేసేటప్పుడు ద్యాస అంతా వంట మీదనే కాకుండా చుట్టు పక్కల కూడా ఒక కన్నేసి ఉంచాలి అని.కొంత మంది మాత్రం వంట చేసేటప్పుడు ఆ పనిలోనే మునిగిపోయి పక్కన ఏమి జరుగుతున్న సరే మాకు అనవసరం అని పట్టించుకోరు.
సరిగ్గా ఇప్పుడు ఒక మహిళ కూడా అలాగే చేసింది.
కాకపోతే ఈవిడ కాస్త వెరైటీ అన్నమాట.మన అందరం వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకుంటాం.
కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా తలనే అంటించుకుంది.ఒక పక్కన తలకి నిప్పు అంటుకుని జుట్టు కాలిపోతున్న ఈ మాహా తల్లి మాత్రం తనకేమి పట్టనట్లు వంట గదిలో తన పని తాను చేసుకుంటుంది.
ఒక పక్క తలపై మంట మండుతుంటే మరోపక్క పనులు చేసుకుంటూపోయింది.వింటుంటేనే షాకింగ్ గా ఉంది కధ.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.
ఒకసారి వీడియో విషయానికి వస్తే వంటగదిలో ఒక మహిళ హడావుడిగా వంట చేస్తోంది.

ఈ క్రమంలో ఏవో వస్తువులు అవసరం అయ్యి గ్యాస్ స్టౌవ్ కింద ఉన్న షెల్ఫ్ లోకి వంగి చూసి వస్తువులను తీసే క్రమంలో పొరపాటున ఆమె జుట్టు మంటలకు తాకగా మంట అంటుకుంది.విచిత్రం ఏంటంటే ఇలా తన జుట్టుకు మంటలు అంటుకున్న సంగతి ఆమెకు తెలియదు.ఒకపక్క తలపై మంటలు ఎగసిపడుతున్న అది గమనించకుండా ఏవేవో పనులు చేస్తూ సామాన్లు సర్దుతుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పక్క జుట్టు కాలుతున్న వాసన కూడా ఆమె గ్రహించకుండా పని చేసుకుంటుంది.కొద్ది సేపటికి తలపై చూసుకోగా మంటలు మండుతున్నాయి.వెంటనే తలపై నీళ్లు పోసి మంటలను ఆర్పేసింది.ఈ ఘటన అంతా అక్కడి కెమెరాలో రికార్డ్ అవ్వగా ఈ వీడియోను @Jamie24272184 అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగ అది కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటిలోనే లక్షల మంది దాక చూసారు.అలాగే వీడియో చుసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్zijilhl పెడుతున్నారు.







