అడవిలో బతకాలంటే వేట సాగించాల్సిందే.ఎందుకంటే వేట లేదంటే క్రూర మృగాలు బ్రతకడం అసాధ్యం.
అయితే వాటికి తమ కడుపు నింపుకునే అవి చేసే వేటలో ఎలాంటి జాలి దయ లాంటివి అస్సలు చూపించవు.అవతల ఉన్నది చిన్న ప్రాణమా పెదద్ ప్రాణమా అని అవేవీ పట్టించుకోవు.
దాన్ని వేటాడి తమ ఆహారంగా మార్చుకోవడం మాత్రమే వాటికి తెలుసు.ఇక సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు వాటికి ఏ జంతువు నచ్చితే వాటిని తమ ఆహారంగా మార్చేసుకుంటాయి.
ఇక వాటిని తప్పించుకోవడానికి మిగతా జంతువులు పరిగెత్తినా తప్పించుకోవడం కష్టమే.
ఇక ఇందులో మరీ ముఖ్యంగా చిరుత వేట గురించి ఎన్ని సార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే.
వేటలో మిగతా జంతువులకంటే వేగం తెలివి దీనికే ఎక్కువగా ఉంటాయి.అది వేటాడాలని ఫిక్స్ అయితే మాత్రం ఎర తప్పించుకోవడం అంటే అది కల అనే చెప్పాలి.
ఎంతో పక్కా వ్యూహాన్ని రచించి వాయువేగంతో చిరుత తన ఎరపై దాడి చేసి వేటాడుతుంది.కాగా మనకు ఏ వీడియో చూసినా చిరుత పులులు ఎక్కువగా జింకలను వేటాడతాయనే తెలుసు.ఇక చిరుతలకు ఎక్కువగా జింక మాంసం అంటేనే ఇష్టం.ఈ కారణంతోనే చిరుత వాటినే ఎక్కువగా వేటాడుతుంది.

ఇక ఇప్పుడు ఓ జింక పిల్ల చిరుత చేతికి చక్కింది.అయితే ఇక్కడే చిరుత క్రూరత్వం చూస్తే ఇంకోవైపు నిజఃగా తల్లిప్రేమకు అద్దంపట్టేలాగా అక్కడే ఉన్న తల్లి జింక ప్రేమను కూడా చూడొచ్చు.జింకపిల్లను దొరకిన వెంటనే తన నోట్లో కరుచుకుని బయలు దేరిన చిరుతను ఆ తల్లి జింక ఎలాగైనా తన జింక బిడ్డను కాపాడుకోవాలనే తాపత్రయంతో చిరుతను పాలో అవుతుంది.కానీ చిరుత మాత్రం కనికరం అనేదే లేకుండా ఆ జింక పిల్లను పట్టుకుని చెట్టు ఎక్కేస్తుంది.
ఇక పిల్ల కోసం ఆ జింక ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది.







