ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

సినిమా రంగంలోకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు.పోతుంటారు.

 Tollywood Heroines Who Received Best Actress Award , Priyamani, Nayanatara, Keer-TeluguStop.com

కొందరు మాత్రమే జనాల మదిలో నిలిచిపోతారు.కెరీర్ లో పది సినిమాలు చేసే కంటే ఒక్క హిట్ సినిమా చేస్తే చాలు అనేలా నటించారు కొందరు హీరోయిన్లు.

నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తే.ఆటోమేటిక్ గా మంచి గుర్తింపు వస్తుంది.

వరుసగా అవకాశాలూ వెతుక్కుంటూ వస్తాయి.కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.అలాంటి చక్కటి నటనతో జనాల మనసులను దోచుకున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* విజయశాంతి

లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయశాంతి ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది.సరిలేరు నీకెవ్వరు, అడవి చుక్క, ఓసేయ్ రాములమ్మ లాంటి అద్భుత సినిమాలు చేసి అందరినీ మెప్పించింది.1990లో విడుదలైన కర్తవ్యం మూవీతో తన సత్తా చాటుకుంది.ఈ చిత్రానికి తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది.ఒసేయ్ రాములమ్మతో పాటు ప్రతిఘటన సినిమాలకు నంది అవార్డులు అందుకుంది.

*రమ్య కృష్ణ

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

దేవ్ 2018, గ్యాంగ్, శైలజారెడ్డి అల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నరసింహా సినిమాలో పోటా పోటీగా నటించింది రమ్యకృష్ణ.కంటే కూతుర్నే కను చిత్రానికి గాను నంది అవార్డును అందుకుంది.బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.

*మీనా

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

సాక్ష్యం, మామ మంచు అల్లుడు కంచు, దృశ్యం లాంటి సినిమాలో నటించింది ఈ అందాల తార.తన తొలి మూవీ ఆరంభంలోనే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో మంచి గుర్తింపు పొందింది.ఈ సినిమాలో నటనకు గాను తను నంది అవార్డు వచ్చింది.రాజేశ్వరి కళ్యాణం అనే మరో సినిమాకు కూడా ఆమె నంది పురస్కారం తీసుకుంది.

* సౌందర్య

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

తెలుగులో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సౌందర్య.నర్తనశాల, శ్వేత నాగు, శివశంకర్ లాంటి సినిమాల్లో నటించారు.సౌందర్య తన కెరీర్ లో పవిత్రబంధం, అమ్మోరు, అంతఃపురం సినిమాల్లో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది.

*శ్రీదేవి

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

పులి, ఇంగ్లీష్ వింగ్లీష్, గోవిందా గోవిందా లాంటి పేరొందిన సినిమాల్లో నటించింది ఈ అందాల తార.వెంకటేష్ తో కలిసి నటించిన క్షణ క్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది.తమిళం, హిందీలో కూడా పలు అవార్డులు అందుకుంది.

*ఆమని

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

చావు కబురు చల్లగా, అర్థ శతాబ్దం, అమ్మ దీవెన లాంటి పలు సినిమాల్లో నటించింది.మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డులు తీసుకుంది.శుభలగ్నం సినిమాకు ఫిలింఫేర్ అవార్డు పొందింది.

రోజా

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

D/O రాంగోపాల్ వర్మ, పవిత్ర, జగద్గురు ఆది శంకరతో పాటు పలు సినిమాల్లో నటించింది రోజా.సర్పయాగం, స్వర్ణక్క సినిమాలకు గాను నంది అవార్డులు పొందింది.

*అనుష్క శెట్టి

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

నిశబ్ధం, సైరా నరసింహా రెడ్డి, భాగమతి సినిమాల్లో నటించింది అనుష్క.అరుంధతి చిత్రానికి గాను నంది అవార్డు దక్కించుకుంది.బాహుబలి, రుద్రమదేవి సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది.

*సమంత

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

జాను, మజిలీ, సీమరాజా సహా పలు సినిమాల్లో నటించింది.ఏ మాయ చేసావే చిత్రంతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.మనం, అత్తారింటికి దారేది, అ.ఆ, రంగస్థలం సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

*కీర్తి సురేష్

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

రంగ్ దే, పెంగ్విన్, మిస్ ఇండియా సహా పలు సినిమాల్లో నటించింది కీర్తి సురేష్.మహానటి సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది.

*నయనతార

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

దర్బార్, అమ్మోరు తల్లి, వసంతకాలం సినిమాల్లో నటించింది.శ్రీరామ రాజ్యం సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది.

*ప్రియమణి

Telugu Amani, Anushka Shetty, Keerthi Suresh, Meena, Nayanatara, Priyamani, Ramy

నారప్ప, కల్పన-3, మన ఊరి రామాయణం సహా పలు సినిమాల్లో నటించింది.2006లో పరుత్తివీరన్ అనే తమిళ చిత్రానికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube