సాధారణంగా మెదడుకు మేత పెట్టే ప్రశ్నలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి.ఇలాంటి క్వశ్చన్స్‌కు సాల్వ్ చేసేందుకుగాను నెటిజన్లు తలలు పట్టుకుంటారు.
అయితే, ఒకసారి సొల్యూషన్ దొరొకితే చాలు.చాలా ఆనందపడిపోతుంటారు.
ఈ క్రమంలోనే ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్ చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి విషయాలపై చర్చించుకుంటారు.
కాగా, అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.అందులో ఉన్న క్వశ్చన్ ఏంటంటే.
వెరీ సింపుల్ క్వశ్చన్.వాళ్లు ఇచ్చిన ఫొటోలో ఓ వస్తువు ఎక్కడుందో? గుర్తించాలి.తాజాగా వైరలవుతున్న పిక్‌లో ఓ చిరుత దాగుందట.దాన్ని గుర్తించేందుకు నెటిజనాలు అవస్థలు పడుతున్నారు.చాలా మంది ఆన్సర్ చెప్పలేకపోతున్నారు.ఇకపోతే ఆ ఫొటో చూస్తే కూడా చాలా నార్మల్‌గానే అనిపిస్తుంది.
ఈ పజిల్ పిక్చర్‌లో ఓ కొండ లాంటి ప్రాంతం ఉంటుంది.దాని చుట్టూర మంచు ఉన్నట్లు కనబడుతుంది.
అయితే అందులోనే చిరుత దాగుందని అంటున్నారు.కానీ, చిరుత శరీరం.
ఆ ప్రాంతం ఒకే రంగులో ఉండటం వల్ల రెండు కలిసిపోయి ఉంటాయి.దాంతో ఫొటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపెట్టడం చాలా కష్టంగా మాత్రమే కాదు చాలెంజింగ్‌గా ఉంటుంది.
అయితే, ఈ ఫొటో ఫొటోషాప్ ఇమేజ్ కాదు.సౌరభ్ దేశాయ్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సుమారు మూడేళ్లు కష్టపడి హిమాలయ పర్వతాలపై ఉన్న ‘మంచు చిరుత’ను తన కెమెరాతో బంధించాడు.
ఈ మంచు చిరుత ప్రత్యేకత పేరులోనే తెలిసిపోతుంది మనకు.ఈ చిరుతలు ‘మంచు’లోనే దాక్కుని ఉంటాయి.
మంచిగా మంచులోనే సేద తీరుతూ హాయిగా గడుపుతుంటాయి.కాగా, ఈ ఫొటోను చూసి చాలా మంది చిరుతను గుర్తుపట్టడంలో ఫెయిల్ అయ్యారు.
మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అవుతారు కావచ్చు.కానీ, క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు మంచులోపల ఉన్న చిరుత కనబడుతుంది.
ఇంకెందుకు ఆలస్యం మరి.మీరు కూడా ఫొటో చూసి ‘మంచు చిరుత’ను గుర్తు పట్టేందుకు ట్రై చేయండి.