యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఆయన నటించే సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతుంటారు.
ఇక ఆయన నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఎలాంటి పాత్రలోనైనా ఔరా అనిపించే రీతిలో తారక్ విశ్వరూపం చూపిస్తుంటాడు.
కాగా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తారక్ తన సత్తా చాటుతున్నాడు.గతంలో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1కి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ షో ఘన విజయం కావడంలో తారక్ వంతు చాలా ఉంది.
ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.జెమిని టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షో త్వరలో టెలికాస్ట్ కానుంది.
ఈ షోకు తారక్ హోస్ట్‌గా చేయబోతున్నాడు.ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ షో ఎప్పుడు ప్రారంభిస్తారా అనే అంశంపై నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.తాజాగా ఈ షోను ఆగస్టు 22న ప్రారంభించనున్నట్లు తెలిపారు.22న కర్టన్ రైజర్, 23 నుంచి రాత్రి 8.30 గంటలకు ఈ షో టెలికాస్ట్ కానుంది.
ఇక తారక్ ఫ్యాన్స్ ఈ షోను ఎలాగూ మిస్ కారు.
అలాగే అందరూ ఇంట్లో ఉండే సమయం కావడంతో ఆ సమయంలో ఈ షోను దాదాపు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ వీక్షిస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.సోమవారం నుండి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు జెమిని టీవీలో ఈ షో టెలికాస్ట్ కానుంది.మరి ఈ షోను ఎన్టీఆర్ ఏ లెవెల్‌కు తీసుకెళ్తాడో చూడాలి.
అటు సినిమాల పరంగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.







