టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తూ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు.ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది.కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ 2 కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వారందరూ ఆతృతగా ఉన్నారు.
అయితే కేజీఎఫ్ 2 చిత్రాన్ని పుష్పతో కలిసి ఒకేసారి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అటు పుష్ప చిత్రాన్ని కూడా డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ లెక్కన ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మొత్తానికి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండటంతో, ఈ రెండింటిలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందా అనే ఆసక్తి అప్పుడే సినీ ప్రేమికుల్లో మొదలైంది.







