అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. సదా కామెంట్స్ వైరల్..?

తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా హీరోయిన్ సదాకు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

జయం, అపరిచితుడు, నాగ, వీరభద్ర మరికొన్ని సినిమాలు సదాకు నటిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి.

తాజాగా ఒక షోకు హాజరైన సదా తనది రత్నగిరి అని తనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే ఇష్టమని సదా చెప్పుకొచ్చారు.తాను పది, ఇంటర్ లో 92 శాతం మార్కులు వచ్చాయని సదా పేర్కొన్నారు.

తనకు బ్లడ్ అంటే భయం కావడంతో ఇంజనీరింగ్ లో చేరాలని అనుకున్నానని సదా తెలిపారు.ఇంజనీరింగ్ క్లాసులు ఆలస్యం కావడంతో తల్లి అనుమతితో యాక్టింగ్ స్కూల్ లో చేరానని సదా వెల్లడించారు.

చండాలంగా ఉన్న ఫోటోలను చూసి తేజ గారు సెలెక్ట్ చేశారని తేజ నన్ను అడిషన్స్ చేయకుండానే హీరోయిన్ పాత్రకు ఎంపిక చేశారని తేజ విజన్ గ్రేట్ అని సదా చెప్పుకొచ్చారు.వెళ్లగయ్యా వెళ్లు డైలాగ్ కు టేక్స్ ఎక్కువగా తీసుకున్నానని సదా చెప్పారు.

Advertisement

జయం తర్వాత రెండు మూడు నెలలు తనకు ఆఫర్లు రాలేదని తర్వాత నాగ మూవీలో ఛాన్స్ వచ్చిందని సదా పేర్కొన్నారు.తాను వీగన్ అని పాలు కూడా తాగనని సదా పేర్కొన్నారు.జంతువుల నుంచి ఉత్పత్తులు కాకుండా అన్నీ తింటానని సదా వెల్లడించారు.

పెళ్లి చేసుకోకవడానికి వీగన్ అయిన మనిషి దొరకాలని తాను కోరుకుంటున్నానని సదా చెప్పుకొచ్చారు.అలా ఉంటే తనకు నచ్చవచ్చని ఆమె తెలిపారు.

అమ్మ నాన్న ముంబైలో ఉంటారని వాళ్లది లవ్ మ్యారేజ్ అని చెప్పారని సదా వెల్లడించారు.2015 సంవత్సరంలో అమ్మకు క్యాన్సర్ అని తెలియడంతో కొన్ని సినిమాలకు తాను అంగీకరించలేదని సదా చెప్పుకొచ్చారు.అమ్మ బర్త్ డే రోజు ఈ విషయం తెలిసిందని సదా పేర్కొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు