దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.
ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఇచ్చి సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.అయితే రాష్ట్రంలో చాలా చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను సడలించారు.
కేసులు తక్కువగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే విధించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సడలింపులు ఇచ్చిన ఆయా జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్నాయని అందుకే సడలింపులు ఇవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లల్లో మాత్రం కర్ఫ్యూని ఇదివరకు ప్రకారంగానే కొనసాగిస్తున్నారు.
ఈ జిల్లాల్లో మార్నింగ్ 6 టూ ఈవెనింగ్ 6 వరకే సడలింపు ఉంటుంది.ఇక ఈ నిర్ణయాలు జూలై 7వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు.జూలై 7 తర్వాత మిగిలిన ఈ ఐదు జిల్లాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.