ఐక్యరాజ్యసమితిలో భారతీయుడికి కీలక పదవి.. ఐరాస బ్యూరోక్రసీ ఆయన కనుసన్నల్లోనే..!!

ఐక్యరాజ్యసమితిలో భారతీయ దౌత్యవేత్తకు కీలక పదవి దక్కింది.యూఎన్‌ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి నాగ‌రాజ్ నాయుడు ఎన్నిక‌య్యారు.

యూఎన్ 76వ సమావేశానికి అధ్య‌క్షుడిగా నియమితులైన మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ఉప ప్రతినిధిగా ఉన్న కే నాగరాజ్ నాయుడును ‘చెఫ్ డీ క్యాబినెట్’గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.సమితిలో ఇది ఒక ముఖ్యమైన ప‌ద‌వి.

ఐక్యరాజ్యసమితిలోని బ్యూరోక్రసీ ‘చెఫ్ డీ క్యాబినెట్’ నియంత్రణలో ఉంటుంది.‘చెఫ్ డీ క్యాబినెట్’ ఏ అంతర్జాతీయ సంస్థలోనైనా సీనియర్ బ్యూరోక్రాట్.

సంస్థ ఉన్నత పదవిలో నియ‌మితుల‌య్యే వారి వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేస్తారు.చెఫ్ డీ క్యాబినెట్ పదవి కోసం ఆఫ్ఘనిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్ జల్మై రసూల్‌- నాగ‌రాజ్ నాయుడు పోటీ పడ్డారు.

Advertisement

దీనికి ఓటింగ్ నిర్వహించగా నాయుడుకు 143, రసూల్‌కు 48 ఓట్లు మాత్రమే వచ్చాయి.దీంతో నాయుడు నియామకం ఖరారైంది.

అనంత‌రం నాగరాజ్ నాయుడు ప్రస్తుత జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్కిర్‌తో భేటీ అయ్యారు.కొత్త జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైన అబ్దుల్లా షాహిద్ ఈ నెల‌ 7 న అధ్య‌క్ష‌ పదవికి ఎన్నికయ్యారు.

సెప్టెంబరులో షాహిద్ పదవీ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు.

1998 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన నాగరాజ్ నాయుడు చైనీస్‌లో అనర్గళంగా మాట్లాడగలరు.భారతీయ సనాతన యోగాలోనూ ఆయనకు ప్రవేశం వుంది.2017-18 మధ్య యూరప్ వెస్ట్ డివిజన్‌ జాయింట్ సెక్రటరీగా యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఐర్లాండ్, బెల్జీయం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, సాన్ మారినో, మొనాకో, యూరోపియన్ యూనియన్లతో భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు